http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 13 April 2015

On 18:22 by Unknown   No comments
allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన చిత్రం 's/o స‌త్య‌మూర్తి'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన అత్య‌ధిక థియేటర్స్‌లో విడుదలైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులానీ, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటించారు. ఈ చిత్రం ఓపెనింగ్ తొలి రోజు నుంచే సూప‌ర్‌హిట్ టాక్‌ని సాదించ‌ట‌మే కాకుండా రికార్డు క‌లెక్ష‌న్ల రాబ‌ట్టింది. ఆల్ ఎరియాస్‌లో మౌత్‌ టాక్‌తో థియేట‌ర్స్‌కి ప్రేక్ష‌కుల్ని రాబ‌డుతోంది. టాలీవుడ్ టాప్ 3 ఓపెనింగ్ గ్రాస‌ర్‌గా 's/o స‌త్య‌మూర్తిస నిలిచింది. అంతేకాకుండా క‌న్న‌డ‌లో టాప్ 1 గ్రాస‌ర్‌గా నిల‌వ‌టం విశేషం. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క‌లెక్ష‌న్ల రికార్డుల సాధిస్తుంద‌ని ట్రెడ్ వ‌ర్గాలు చెబుతున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ త‌న ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌‌ల కాంబినేష‌న్‌తో మా బ్యానర్లో నిర్మించిన చిత్రం 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న గ్రాండ్‌గా విడుద‌ల‌ైంది. విడుద‌ల రోజు ఉద‌యం ఆట‌నుండే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్ హిట్ అనే టాక్ విన‌టం చాలా ఆనందంగా వుంది. 
 
అంతేకాకుండా ఎంతో ప‌వ‌ర్‌ఫుల్ అయిన మౌత్ టాక్ పెర‌గ‌టం థియేట‌ర్స్‌కి తండోప‌తండాలుగా ప్రేక్షకులు తరలి రావ‌టం సంతోషంగా వుంది. మెద‌టిరోజునే అల్లు అర్జున్ కెరీర్‌లో రికార్డు ఓపెనింగ్ వ‌చ్చాయి. బ‌న్నీ కెరీర్‌లో ఇది నెం1 చిత్రంగా నిలుస్తుంద‌ని అంతేకాకుండా 2015లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా ఉండ‌బోతుంద‌ని ట్రెడ్ వ‌ర్గాలు చెబుతున్నారు. అలాగే, క‌న్న‌డ ఇండ‌స్ట్రీ న‌టుడు ఉపేంద్ర మా చిత్రంలొ న‌టించ‌డంతో కన్న‌డ‌లో కూడా బారీ ఓపెనింగ్స్ వ‌చ్చి నెంబ‌ర్ 1గా నిలిచింది. 
 
మా డిస్ట్రిబ్యూట‌ర్స్ మ‌రియు ఎగ్జిబ్యూట‌ర్స్ సినిమా గురించి త‌మ సంతోషాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు ఇంత మంచి విలువ‌లున్న చిత్రం ఈ మ‌ధ్య కాలంలో రాలేదంటున్నారు. ముఖ్యంగా త్రివిక్ర‌మ్ గారి మాట‌లు అంద‌రి మ‌న‌సుల్ని ఆక‌ట్టుకునేలా వున్నాయి. అవి అల్లు అర్జున్ నోట రాగా అంద‌రి మ‌న‌సుల్లోకి దూసుకుపోయాయి. ప్ర‌కాష్‌రాజ్ చెప్పిన పులి మేక క‌థ నుంచి స్టార్ట‌యితే అస‌లు తండ్రి గురించి హీరోయిన్ సమంత ద‌గ్గ‌రి బ‌న్నీ చెప్పే డైలాగ్ కానివ్వండి, రాజేంద్ర‌ప్ర‌సాద్ ద‌గ్గ‌ర అల్లు అర్జ‌ున్ కొన్ని సార్లు ఓడిపోవ‌డ‌మే మంచిదని పురాణాల ఆధారంగా చెప్పిన డైలాగ్ కానీ చివ‌రిలో ఉపేంద్ర చెప్పే డైలాగ్స్ కానీ ఇలా ఓక‌టేంటి త్రివిక్ర‌మ్ గారు రాసిన ప్ర‌తి డైలాగ్, అల్లు అర్జున్ చెప్పిన ప్ర‌తి మాట‌, బ్ర‌హ్మ‌నందం వేసిన పంచ్‌లు, రాజేంద్ర‌ప్ర‌సాద్ పాత్ర తెప్పించే న‌వ్వులు, అలీ చేసిన కామెడీ, ఎమ్‌.ఎస్‌.నారాయ‌ణ, రావుర‌మేష్‌ల మ‌ధ్య స‌న్నివేశాలు ఇలా ప్ర‌తి ఒక్క స‌న్నివేశం ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. కాబ‌ట్టే ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించారు. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి మా చిత్రం యూనిట్ త‌రుపున ధ‌న్య‌వాదాలు అని చెప్పారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov