http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 22 July 2017

On 20:15 by Unknown   No comments
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు పాకిస్తాన్ మాత్రమే మనకు పక్కలో బల్లెం అనుకున్నాం. కానీ నిజానికి మన శత్రువు చైనా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆదినుంచీ చైనా తీరు కూడా ఈ మాటలకు నిదర్శనంగానే కనిపిస్తోంది. తాజాగా సిక్కిం సరిహద్దులోని డోక్లామ్ వివాదం భారత్, చైనా నడుమ యుద్ధానికి నేపథ్యంగా మారుతోంది. ఇప్పటికే తన అధికారిక మీడియా ద్వారా మాటల యుద్ధం మొదలుపెట్టిన చైనా.. భారత్ పై ఇక చేతల యుద్ధానికి 'సై' అంటోంది.మేం కాదు, మీరే ఉపసంహరించుకోవాలి...
రెచ్చగొడుతున్న చైనా మీడియా... భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదంపై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది చైనా అధికారిక మీడియా. వివాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ గురువారం పార్లమెంట్‌లో చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని, భారత్‌కు ఏ దేశమూ మద్దతివ్వట్లేదని పేర్కొంది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌' తన తాజా సంపాదకీయంలో ప్రచురించింది. సుష్మా స్వరాజ్ వి అబద్ధాలు... ‘రాజ్యసభలో సుష్మాస్వరాజ్‌ చెప్పినవి అబద్ధాలు అని చెప్పడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది.. చైనా భూభాగంపై భారత్‌ దాడి చేస్తోంది. అంతేగాక, సరిహద్దులో ఆ దేశం ప్రవర్తిస్తున్న తీరుపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. ఏ దేశం భారత్‌కు మద్దతివ్వట్లేదు. ఇక రెండోది.. భారత్‌ కన్నా చైనాకు మిలిటరీ సామర్థ్యం ఎక్కువ. ఒకవేళ యుద్ధమే జరిగితే భారత్‌ ఓడిపోవాల్సిందే' అని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. మేం కాదు, మీరే ఉపసంహరించుకోవాలి... ఏ క్షణంలోనూనా యుద్ధం?సుష్మాస్వరాజ్‌ సూచించినట్లుగా రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చైనా మీడియా స్పష్టం చేసింది. చైనా బలగాలు వెనక్కి వెళ్లవని, భారత్‌ ఏకపక్షంగా సరిహద్దును వీడాలని సూచించింది. అంగుళం భూమిని కూడా వదులుకోడానికి చైనా సిద్ధంగా లేదని, ప్రజల సెంటిమెంట్‌ను చైనా ఆర్మీ ఎప్పటికీ బాధపెట్టబోదని పేర్కొంది. భారత బలగాలు వెనక్కి వెళ్లకపోతే.. ఇక ఈ సమస్యకు యుద్ధమే చివరి పరిష్కారమని కూడా చైనా మీడియా హెచ్చరికలు చేసింది. 

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov