http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 26 July 2017

On 20:13 by Unknown   No comments
Malayalam actress abduction: Kavya Madhavan quizzed on ‘missing links’కొచ్చి: మలయాళ నటిపై లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హీరో దిలీప్ ఇంకా జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దిలీప్ భార్య కావ్యామాధవన్ పై కూడా పలు ఆరోపణలు ఉండటంతో.. మంగళవారం ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఆమెను విచారించింది. ముఖ్యంగా కేసుకు సంబంధించి కొన్ని 'మిస్సింగ్ లింక్స్'పై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. నిన్నటి విచారణలోను దీనిపై కావ్యను అధికారులు ప్రశ్నించారు. తొలుత ఉదయం 11గం.కు అలువా ప్రాంతంలోని దిలీప్ ఇంటికి సిట్ బృందం చేరుకుంది. దాదాపు 5గం. పాటు కావ్యను అధికారులు విచారించారు. సీక్రెట్ 'లీక్' చేసిందనే!: నటి నగ్న ఫోటోలు తీయించి మరీ.. దిలీప్ చెప్పిన నిజం? తమ వద్ద ఉన్న కొత్త సాక్ష్యాధారాలు, అలాగే మిస్సయిన సీసీటీవీ ఫుటేజీకి సంబంధించి ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను కావ్య వద్ద అధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కక్కనాడ్ స్టోర్ వద్దకు పల్సర్ సునీ వెళ్లిన ఆధారాలను సిట్ అధికారులు సంపాదించారు. అయితే ఈ సీసీటీవి దృశ్యాలు మిస్ అవడం పట్ల పలు అనుమానాలు ఉన్నాయి. కావ్యా మాధవన్ విచారణకు సంబంధించి కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఏవీ గార్జ్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఆమెను విచారించామని, ప్రస్తుతానికి తాను ఇది మాత్రమే చెప్పగలనని చెప్పుకొచ్చారు. దిలీప్ పూర్వీకుల నివాసంలో 6గం. పాటు కావ్యను ప్రశ్నించగా.. పలుమార్లు ఆమె వెక్కి వెక్కి ఏడ్చినట్లు సమాచారం. నటి లైంగిక దాడి కేసు: హీరో దిలీప్ ను కోర్టుకు తీసుకురాలేం: చేతులు ఎత్తేసిన పోలీసులు ! కాగా, అంతకుముందు విచారణలో కక్కనాడ్ లోని ఓ స్టోర్ వద్ద మెమొరీ కార్డును అప్పగించినట్లు పల్సర్ సునీ అంగీకరించాడు. ఆ మెమొరీ కార్డు కావ్యా మాధవన్ కు చేరి ఉంటుందన్న అనుమానాలతో ఆమెను విచారించింది సిట్. మెమొరీ కార్డు వ్యవహారానికి సంబంధించి పోలీసులపై సైతం విమర్శలున్నాయి. షాపును తనిఖీ చేయడం గానీ, యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రశ్నించడం గానీ పోలీసులు చేయలేదు. దీంతో వారిపై విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో.. పల్సర్ సునీ షాపును సందర్శించిన దృశ్యాలు సీసీటీవి నుంచి మిస్ అయిపోయాయి. ఇక ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కన్నా 90రోజుల ముందు సిట్ చార్జీషీటు దాఖలు చేసింది. ఏదేమైనా లైంగిక దాడి సందర్బంగా నిందితులు వినియోగించిన మొబైల్ ఫోన్, అందులోని సిమ్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov