http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 18 July 2017

On 12:00 by Unknown   No comments
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. బిగ్‌బాస్‌ తెలుగు వెర్షన్ హౌజ్‌లోకి పెట్టిన తొలి అడుగుతోనే ఎన్టీఆర్ ఆకట్టుకొన్నాడు. వెండితెర మీదే కాదు.. ఏ తెరైనా ఆడుకోవడం నా అలవాటు అని నిరూపించాడు ఎన్టీఆర్. తనదైన శైలిలో మాటలతో గారడి చేస్తూ.. బిగ్‌బాస్ హౌజ్‌ను పరిచయం చేయడం విపరీతంగా ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా సెలబ్రిటీలను యంగ్ టైగర్ పరిచయం చేసిన తీరు ప్రత్యేకంగా ఉంది. పరిచయ కార్యక్రమంలో భావోద్వేగాలను అద్భుతంగా పండించాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ప్రవేశించిన వారిలో అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, మధుప్రియ, సంపూర్ణేశ్‌బాబు, జ్యోతి ఉండటం విశేషం. బిగ్‌బాస్ ఆరంభ కార్యక్రమంలో ఎన్టీఆర్ చేసిన హంగామా, సెలబ్రిటీల గురించి వివరాలు మీ కోసం..

అదరగొట్టిన ఎన్టీఆర్
అదరగొట్టిన ఎన్టీఆర్ బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రారంభించారు. సూపర్ స్టెప్పులతో హోస్ట్‌గా తనకు తానే సాటి అవుతానని సిగ్నల్స్ ఇచ్చాడు. పాటతో మొదలు పెట్టి మాటలతో గారడి చేశాడు. బిగ్‌బాస్ షోను మరో స్టేజ్‌కు తీసుకెళ్తాడన్న ప్రేక్షకుల, నిర్వాహకులు, సన్నిహితుల నమ్మకాన్ని నిలబెట్టాడు ఎన్టీఆర్.తొలి సెలబ్రిటీగా అర్చన

తొలి సెలబ్రిటీగా అర్చన

బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన తొలి సెలబ్రిటీగా అర్చన రికార్డులకెక్కింది. అర్చన సినీ నటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు. కథక్, కూచిపూడి డ్యాన్స్‌లో అందేవేసిన అడుగు ఆమెది. పలు తెలుగు చిత్రాల్లో నటించింది.
సమీర్ ఎంట్రీ ఓ ఆశ్చర్యం

సమీర్ ఎంట్రీ ఓ ఆశ్చర్యం

 బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన రెండో వ్యక్తి సమీర్. సమీర్‌ టెలివిజన్ సీరియల్స్ ద్వారా వీక్షకులకు మంచి పరిచయం ఉంది. తెలుగు సినిమాల్లో కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఫేమస్. బిగ్‌బాస్ షోలో పాల్గొనడం ద్వారా టెలివిజన్, టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంది.

ముమైత్ ఖాన్ ఎంట్రీ ఊహించిందే..

ముమైత్ ఖాన్ ఎంట్రీ ఊహించిందే..

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి సూపర్ డ్యాన్సర్ ముమైత్ ఖాన్. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో మెరిసిన ముమైత్.. పోకిరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఆమె పేరు తెరపైకి రావడం తెలిసిందే.
ప్రిన్స్‌తో బిగ్‌బాస్‌తో గ్లామర్ టచ్

ప్రిన్స్‌తో బిగ్‌బాస్‌తో గ్లామర్ టచ్టా

 లీవుడ్ మంచి ఫాలోయింగ్ ఉన్న యువ హీరోల్లో ప్రిన్స్ సెసిల్స్ ఒకరు. తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ సినిమా ప్రిన్స్‌కు తొలిచిత్రం. ఆ తర్వాత బస్‌స్టాప్, రొమాన్స్, బన్నీ అండ్ చెర్రీ చిత్రాల్లో నటించాడు. నేను శైలజ ఆయన నటించిన చివరి చిత్రం. బిగ్‌బాస్‌లో ఆయన ఎంట్రీ ప్రేక్షకులకు ఓ సర్ఫ్రైజ్ అని చెప్పవచ్చు.

మధుప్రియతో ఎమోషనల్ టచ్

మధుప్రియతో ఎమోషనల్ టచ్

తనపాటలతో మహిళాలోకాన్ని కంటతడి పెట్టించిన జానపద గాయకురాలు మధుప్రియ. తెలంగాణ యాసలో ఆమె పాడిన పాటలు తెలుగు సంగీత అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకొవడం పరిశ్రమలో సంచలనం రేపింది. ఆ తర్వాత భర్తపై గృహహింస కేసు పెట్టడం ఓ వివాదమైంది. బిగ్‌బాస్‌ అవకాశం రావడం ఆమె కెరీర్‌కు మరింత దోహదపడే అవకాశం ఉంది.

టెలివిజన్ తెరపై బర్నింగ్ స్టార్టెలివిజన్ తెరపై బర్నింగ్ స్టార్ 
హృదయకాలేయం సినిమా రిలీజ్‌కు బర్నింగ్ స్టార్ బిరుదుతో సంపూర్ణేష్ బాబు ట్రైలర్‌తో సంచలనం రేపాడు. ఆయన నటించిన హృదయకాలేయం టాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అంతగా విజయాలు లభించలేదు. సన్నిలియోన్‌తో ఆయన కలిసి నటించడం విశేషం. సంపూ నటించిన వైరస్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
జ్యోతికి చిక్కిన మంచి అవకాశం..


జ్యోతికి చిక్కిన మంచి అవకాశం..

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జ్యోతి ఆ తర్వాత ఐటెం పాత్రలతో సరిపుచ్చుకొన్నారు. అడపాదడపా వెండితెరపై హాట్‌హాట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బిగ్‌బాస్‌లోకి రావడం ద్వారా మళ్లీ నటిగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది.
కల్పన రాకతో క్లాసీ ఫ్లేవర్

కల్పన రాకతో క్లాసీ ఫ్లేవర్

దక్షిణాది సినీ పరిశ్రమలో అద్భుతమైన సింగర్లలో కల్పన రాఘవేందర్ ఒకరు. బ్రీత్‌లెస్ పాటపాడిన ఘనత ఆమెకు ఉంది. తమిళ, తెలుగు, ఇతర భాషల్లో పాడిన గాయనిగా గుర్తింపు తెచ్చుకొన్నది. ఖుషీ చిత్రంలో ప్రేమంటే సులువు కాదురా, ఖడ్గంలో ముసుగు వెయ్యెద్దు లాంటి పాటలతో సంగీత అభిమానులకు దగ్గరయ్యారు.
కత్తి మహేశ్ మరో సర్‌ప్రైజ్

కత్తి మహేశ్ మరో సర్‌ప్రైజ్

నటుడిగా, దర్శకుడిగా, సినీ విమర్శకుడిగా కత్తి మహేశ్ టాలీవుడ్‌ ప్రేక్షకులందరికీ పరిచయం ఉంది. హృదయకాలేయం తదితర చిత్రాల్లో నటించిన కత్తి మహేశ్ పెసరట్టు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఎగిసే తారాజువ్వలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
బిగ్‌బాస్‌తో కత్తి కార్తీక మరింత చేరువగా..

బిగ్‌బాస్‌తో కత్తి కార్తీక మరింత చేరువగా..

యాంకర్‌గా కత్తి కార్తీక టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. వీ6 అనే టెలివిజన్ ఛానెల్‌లో ఆమె నిర్వహించిన టాక్ షో బాగా ఆకట్టుకొన్నది. తెలంగాణ యాస ముఖ్యంగా హైదరాబాదీ ప్లేవర్ ఉండే లాంగ్వేజ్ మాట్లాడటం ఆమె ప్రత్యేకత. గత కొద్దికాలంగా టీవీ ప్రేక్షకులకు దూరమైన కత్తి కార్తీక తాజాగా బిగ్‌బాస్‌తో మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.
శివబాలాజీ మరింత గ్లామర్

శివబాలాజీ మరింత గ్లామర్

శివబాలాజీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. సినిమాల్లోకి ప్రవేశించకముందు తన తండ్రి నిర్వహించే ఆయన బిజినెస్ చేశారు. సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. సినీ నటి స్వప్న మాధురిని వివాహం చేసుకొన్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రంలో కనిపించాడు.
హరితేజ మరింత ఆశ్చర్యం

హరితేజ మరింత ఆశ్చర్యం

బిగ్‌బాస్‌లోకి సర్ఫ్రైజ్ ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలో టీవీ నటి హరితేజ ఒకరు. ఆమె రాకను ఎవరూ ఊహించలేదు. ఆమె సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా ప్రేక్షకులను అలరించారు. బిగ్‌బాస్‌తో హరితేజ్ గ్రాఫ్ మరింత దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తున్నది.
ఆదర్శ్‌తో బిగ్‌బాస్‌కు అదనపు ఆకర్షణ

ఆదర్శ్‌తో బిగ్‌బాస్‌కు అదనపు ఆకర్షణ

టాలీవుడ్‌లో విలన్ పాత్రలను పోషించడం ద్వారా ఆదర్శ్ బాలకృష్ణ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టీనేజ్‌లో రాష్ట్రస్థాయి క్రికెటర్. క్రికెట్ కథాంశంగా దర్శకుడు నగేశ్ కుకునూర్ రూపొందించిన ఇక్బాల్ చిత్రంలో కమల్ అనే పాత్రలో తొలిసారి నటించాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాప్పీ డేస్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. వినాయకుడు, గోవిందుడు అందరివాడేలే లాంటి చిత్రాల్లో నటించాడు.
ధన్ రాజ్‌తో బిగ్‌బాస్ హౌజ్‌పుల్

ధన్ రాజ్‌తో బిగ్‌బాస్ హౌజ్‌పుల్

టాలీవుడ్ ప్రేక్షకులకు కమెడియన్ ధన్‌రాజ్ పరిచయం పెద్దగా అక్కర్లేదు. సుకుమార్ తీసిన జగడం చిత్రం ద్వారా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో వచ్చే జబర్దస్థ్ కార్యక్రమంలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు, వీక్షకులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ కమెడియన్లలో ధన్ రాజ్ ఒకరు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov