http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 24 March 2015

On 17:41 by Unknown   No comments
Nagarjuna
అక్కినేని అన్నపూర్ణ 7 ఎకరాలు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు తెలుగు సినీ పరిశ్రమలో.. అలాంటిది... అప్పు విషయంలో ఆ స్థలాన్ని బ్యాంకులో హామీగా పెట్టినందుకు ఆ అప్పు కట్టలేదని అన్నపూర్ణ 7 ఎకరాల గేటుకు బ్యాంకులు నోటీసులు అంటించడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
 
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోసం పక్కనున్న చెరువును కబ్జా చేశారంటూ... అధికారులు కొంతమేర భూమిని స్వాధీనం చేసుకున్న సంగతి మరువక ముందే, అలాంటిదే మరో ఘటన జరిగింది. నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ ఏడు ఎకరాల 25 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకుల నుంచి నోటీసులు అందాయి.
 
అక్కినేని నాగేశ్వరరావు నిర్మించుకున్న స్టూడియోకు సమీపంలో ఉన్న ఈ భూమిని హామీగా ఉంచి నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. అయితే తిరిగి చెల్లించకపోవడంతో ఆ డబ్బు కాస్తా ఇప్పుడు రూ. 62 కోట్లకు చేరుకున్నట్లు చెపుతున్నారు. 
 
దీనికి సంబంధించి బ్యాంకులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా... వీరు స్పందించలేదనీ, దీంతో ఇండియన్ బ్యాంకు, ఆంధ్రబ్యాంకులు ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్టు పత్రికా ప్రకటన ఇచ్చి, నోటీసులు పంపాయి. నాగార్జునతో పాటు, ఆయన సోదరి నాగ సుశీల, సోదరుడు అక్కినేని వెంకట్, సుప్రియ, వై.సురేంద్ర, రొడ్డం వెంకట్ లకు బ్యాంక్ నోటీసులు అందాయి. 
 
అయితే, దీనిపై నాగార్జున ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే, సమస్య నుంచి బయటపడటానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పలువురు... నాగార్జున కూడా ఆర్థిక సమస్యల్లో ఉన్నారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు నాగార్జున ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర విభజన జరిగాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అందువల్ల ఆయన వైజాగ్ షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov