http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 21 August 2015

On 15:06 by Unknown   No comments
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 'సర్ధార్ గబ్బర్ సింగ్' శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా కథానాయికల విషయంలో ఇంతకాలం ఎలాంటి స్పష్టత రాలేదు. ఆరంభమే వైజాగ్ అమ్మాయి అనీషా ఆంబ్రోస్ ని అన్ఫిట్ అంటూ తొలగించేశారు. ఆ తర్వాత రేసులోకి కాజల్ పేరు వచ్చి చేరింది. చందమామ పవన్ సరసన ఫైనల్ అయినట్టేనని టాక్ నడిచింది.

కానీ మరోసారి సీన్ రివర్సయ్యిందని టాక్. కాజల్ మొదటి నుంచి భారీ పారితోషికం డిమాండ్ చేస్తోంది. మినిమం రూ.2కోట్లు అయినా ఇవ్వనిదే నటించనని మొండి కేసిందిట. దాంతో నిర్మాతలు మనసు మార్చుకుని కాజల్ స్థానంలో సమంతని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. సమంత ఇంతకుముందే అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ సరసన నటించింది. ఇప్పుడు  బాస్ తో రెండో ఛాన్స్. కాజల్ ఔట్ సమంత ఇన్ కన్ఫమ్ అయినట్టేనని యూనిట్ చెబుతోంది.

ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov