http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 27 August 2015

On 02:21 by Unknown   No comments
ఇప్పుడు మంది ఎదుర్కొనే ప్రధానమైన సమస్య అధిక బరువు. విపరీతంగా పెరిగిపోయిన బరువుతో నడవలేని స్థితిలో ఉన్న పలువురు రోగాల బారిన పడుతున్నారు. యంగ్ ఏజ్ అమ్మాయిలు అయితే బరువు తగ్గడానికి డైటింగ్‌లు చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. అయితే లండన్‌లోని ఒక యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు మాత్రం బరువు తగ్గడం చాలా
ఈజీ అంటున్నారు. డైటింగ్ చేయాల్సిన అవసరం లేదని, వ్యాయామంతో అసలు పనిలేదని తెలుపుతున్నారు. 
 
మూడు పూటల భోజనం చేసే ముందు అర లీటరు నీళ్లు తాగితే చాలునట. అలా 12 వారాలపాటు చేస్తే ఖచ్చితంగా నాలుగు కేజీల బరువు తగ్గిపోతారని స్పష్టం చేస్తున్నారు. వారు స్థూలకాయంతో బాధపడుతున్న స్త్రీ, పరుషులపై వీరు పరిశోధనలు నిర్వహించారు. 12 వారాలపాటు వారికి భోజనానికి ముందు మంచి నీళ్లిచ్చినట్టు పరిశోధకులు తెలిపారు. 
 
దీంతో వారిలో కొందరు 1.3 కేజీల బరువు తగ్గారని, మూడు పూటలా భోజనం ముందు 500 మిల్లీ లీటర్ల మంచి నీరు తీసుకున్న వాళ్లు నాలుగు కేజీల బరువు తగ్గారని వారు తెలిపారు. బరువెక్కువైందని భావించే వారు వ్యాయామం, శారీరక శ్రమ, అలసట లేకుండా నీళ్లు తాగేసి బరువు తగ్గించుకోవచ్చంటే, అంతకు మించిన సలహా ఇంకేం ఏముంటుంది?...అందుకే, ఇకపై నీళ్లు తాగి నాజూగ్గా తయారవ్వండి!

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov