http://www.propellerads.com/?rfd=TwUb

info

Sunday, 23 August 2015

On 00:41 by Unknown   No comments


చిరంజీవి 150వ సినిమా గురించి ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి మెగాస్టార్‌ గురించి ఆసక్తికర ట్వీట్లు చేశారు. శనివారంతో 60వ ఏట అడుగుపెడుతున్న చిరంజీవి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
 
‘చిరంజీవి గారూ.. మీకు అప్పుడే 60 ఏళ్లు రావడం నాకు నచ్చలేదు. మీ వాళ్లు దీని గురించి వీపరితంగా ప్రచారం చేయడం అంతకన్నా నచ్చలేదు. అభిమానులకు మీరు ఎప్పుడూ 26 ఏళ్ల యువకుడే’ అంటూ ట్వీట్ చేశారు.
 
‘మెగాస్టార్‌ను ఉద్దేశించి కాదు కానీ.. షష్టిపూర్తి అనేది ఓ కుటంబ పెద్దను బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించడానికి సన్నిహితులు ఏర్పాటు చేసే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి చిరంజీవి ఒప్పుకోవడం నన్ను బాధించింది’ అని ట్వీటారు వర్మ.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov