http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 5 September 2015

On 12:11 by Unknown   No comments

భలే భలే మగాడివోయ్ రివ్యూ : భలే భలే వినోదం

bhale bhale magadivoy Movie Review
హీరో నాని, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠిలు జోడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన భలే భలే మగాడివోయ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బూతు చిత్రాల దర్శకుడిగా పేరు గడించిన మారూతి దర్శకత్వం వహించిన చిత్రానికి యు సర్టిఫికేట్ రావడం కమర్షియల్ హిట్లతో సంబంధంలేకుండానటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న నటుడు నాని ఈ సినిమాలో హీరోగా నటించడం, అల్లు అరవింద్ చాలా రోజుల తరువాత (జీఏ2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు.)గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం సినిమాలో ఏదో ఉంది అన్న అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? చూద్దాం
కథ :
మతి మరుపుకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి లక్కీ (నాని)కి మతిమరుపు జాస్తి. మతిమరుపుతో చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఒకటి గుర్తుంటే మరోటి మర్చిపోతుంటాడు. అలాంటి లక్కీ నందన (లావన్‌య త్రిపాఠి)తో తొలి చూపులోనే ప్రేమిస్తాడు. నందన ప్రేమను పొందటానికి తన లోపాలను కప్పిపుచ్చుకుంటూ ఎన్ని ఆటలు ఆడాలో, ఎన్ని అబద్దాలు చెప్పాల్లో అన్నీ చేస్తాడు. చివరికి నందన ప్రేమను పొందుతాడు. నందన తండ్రి (మురళీ శర్మ) చాలా జాగ్రత్తగల మనిషి. ప్రతీది పెరఫెక్ట్‌గా ఉండాలనుకుంటాడు. లక్కీ, నందనలు ప్రేమించుకోక ముందే లక్కీ సంబంధం ఆయన దగ్గరకు వస్తుంది. కానీ లక్కీ మతిమరుపు ఏ స్థాయిలో ఉందో ప్రత్యక్షంగా చూసిన ఆయన ఆ సంబంధం వద్దనుకుంటాడు. నందనను ఇష్టపడే అజయ్ (అజయ్) అనే ఇన్సెక్టర్ ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అజయ్ తండ్రి, నందన తండ్రి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో నందన తండ్రి పెళ్లికి ఓకే అంటాడు. నందన తన ప్రేమ విషయాన్ని చెబుతుంది.
నందన లక్కీని తండ్రికి పరిచయం చేయాలనుకుంటుంది. తన గురించి నందన తండ్రికి తెలుసు కాబట్టి తన స్థానంలో తన స్నేహితుడు (వెన్నెల కిషోర్)ని పంపుతాడు. ఇక ఇక్కడినుండి దాగుడుమూతలు మొదలవుతాయి. నందన తండ్రిని లక్కీ ఎలా ఒప్పిస్తాడు, నందనను పెళ్లి చేసుకోవాలనుకున్న అజయ్ ఏం చేస్తాడు అనేది తెరపై చూడాల్సింది
న‌టీన‌టులేంచేశారు
మతిమరుపున్న లక్కీ పాత్రలో నాని నటన అలరిస్తుంది. నూటికి నూరు శాతం ఆ పాత్రకు న్యాయం చేశాడు. లావణ్యా త్రిపాఠి చాలా అందంగా కనిపించింది. హీరోయిన్ తండ్రిగా చేసిన మురళీ శర్మ దాదాపు నాని పాత్రతోపాటు కొనసాగుతుంది. మంచి నటనను కనబరిచాడు. ఆయన వాయిస్ ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. నానీ ఫ్రెండ్స్‌గా నటించిన ప్రవీణ్, వెన్నెల కిషోర్‌లు బాగా నవ్వించారు.
బూతు నుండి ఫ్యామిలీకి 
మారుతి గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. బూతు చిత్రాల దర్శకుడిగా పేరుపొందాడు. ఆ ఇమేజ్‌కి భయపడే ప్రేమ కథా చిత్రమ్ సినిమాకు తన పేరు కాకుండా వేరే వాళ్ల పేరుతో రూపొందించాడని అంటారు. ఈ రోజుల్లో, బస్టాప్‌లాంటి చిత్రాల తరువాత కొత్త జంట పేరుతో ఆ ఇమేజ్‌నుండి బయటపడే ప్రయత్నం చేసినా ఈ భలే భలే మగాడివోయ్‌తో మొత్తంగా బయటపడ్డాడు. ఈ సినిమాకు యు సర్టిఫికేట్ రావడమే ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమాను చాలా నీట్‌గా తెరకెక్కించి తనలోని మరో కోణాన్ని చూపించాడు. మతి మరుపున్న వ్యక్తి ఎన్ని పాట్లు పడతాడు అనే చిన్న లైన్‌ను సినిమాగా తెరకెక్కించడం చాలా కష్టం. కానీ మారుతి సినిమాను పకడ్బందీగా, కామెడీ ఎక్కడా మిస్ కాకుండా చూసుకున్నాడు. సినిమా చూస్తుంటే తరువాత ఏం జరుగుతుందోనన్న ఆత్రుత పెరుగుతుంది.
సినిమా: భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌
న‌టీన‌టులు: నాని, లావ‌ణ్య‌త్రిపాఠి, ముర‌ళీశ‌ర్మ‌, సీనియ‌ర్ న‌రేష్‌, సితార‌, అజ‌య్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, ప్ర‌వీణ్‌
బ్యాన‌ర్‌: గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేష‌న్స్‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: మారుతి
సెన్సార్ స‌ర్టిఫికేట్‌: క్లీన్ యూ
రిలీజ్ డేట్‌: 4 సెప్టెంబ‌ర్‌, 2015
చూడాలా వద్దా…
మొత్తానికి ఫ్యామిలీతో కలిసి చూసే భలే భలే మగాడివోయ్ చిత్రం తీసినందుకు దాసరి నారాయణరావు కృతజ్ఞతలు తెలపాలి. అయ్యో మా మతిమరుపు మండ మారుతికి చెప్పాలిగా… వినోదభరితమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – పక్కా చూడాల్సిన చిత్రం
రివ్యూ – కమల్ ప్రసాద్ కొండపల్లి

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov