http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 3 October 2015

On 12:22 by Unknown in    No comments
రామ్ గోపాల్ వర్మ సినిమా కెరీర్ పై గాడ్ ఫాదర్ చిత్రం ప్రభావం ఎంతలా ఉందో.. పర్సనల్ లైఫ్ పై బ్రూస్ లీ ప్రభావం కూడా అంతే ఉంది. సినిమాల్లోకి రాకముందే బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ... అప్పట్లోనే ఆ స్పూర్తితో మార్షల్ ఆర్ట్ స్కూల్ లోనూ చేరాడు... సినిమాల్లోకి వచ్చాక మార్షల్ ఆర్ట్స్ ను మానేసినా.. బ్రూస్ లీ గురించి, ఆయన ఆలోచనా విధానం గురించి తెలుసుకోవడం మాత్రం మానలేదంటున్నాడు వర్మ.... బ్రూస్ లీ స్టైల్ తన సినిమాలపైనా.. పర్సనల్ లైఫ్ పైనా తీవ్ర ప్రభావం చూపించిందనే వర్మ.. ఇప్పడు బ్రూస్ లీ అభిమాని కథతో ఓ హిందీ చిత్రం తెరకెక్కిస్తున్నాడు... బ్రూస్ లీ స్పూర్తితో ఓ యువతి మార్షల్ ఆర్ట్స్ లో ఎలా మెప్పించిందనేది ఈ సినిమా కథ... అందుకే ఈ సినిమాకు బ్రూస్ లీ అనే టైటిల్ నే ఎంపిక చేశానంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.... ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ టైటిల్ తో సినిమా రూపొందుతోంది... చిరంజీవి గెస్ట్ రోల్ లో కన్పించనున్న ఈ చిత్రం.. అక్టోబర్-16న విడుదల కాబోతోంది. మరోవైపు తమిళంలోనూ బ్రూస్ లీ టైటిల్ తో ఓ సినిమా రూపొందుతోంది. జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్... సో ఇలా తెలుగు, తమిళ, భాషల్లో ఇప్పటికే బ్రూస్ లీ టైటిల్ తో సినిమాలు వస్తుంటే... ప్రస్తుతం అదే టైటిల్ తో హిందీతో వర్మ సినిమా తెరకెక్కుతుండటం విశేషం... అయితే ఈ మూడు చిత్రాల్లో టైటిల్ కు తగ్గ రీతిలో పక్కా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సినిమా మాత్రం వర్మ దర్శకత్వంలో వస్తున్న బ్రూస్ లీనే... పైగా ఈ సినిమా ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ మూవీ అంటున్నాడు వర్మ... అయితే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలున్న రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమాకు సంబంధించి తాజాగా రియో సాంగ్ మేకింగ్ ను విడుదల చేశారు... చిరు స్పెషల్ రోల్ చిత్రీకరణ కూడా శుక్రవారంతో పూర్తయిన ఈ చిత్రం ఆడియోను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు.. మరి బ్రూస్ లీ టైటిల్ తో వస్తున్న ఈ మూడు చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందో చూడాలి..!

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov