http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 10 October 2015

On 22:18 by Unknown in    No comments

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులు, ఇంకా దేశంలోని ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ లను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడి వరకూ బానే ఉన్న ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర మాత్రం కాస్తంత ఆసక్తికర చర్చ జరుగుతుంది. అది ఎవరో కాదు ఇంకో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

ఆంధ్ర నేతలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, తెలంగాణను దోచుకుంటున్నారని గగ్గోలు పెట్టి ఉద్యమాలు చేసి మరీ తెలంగాణను సాధించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆంధ్రోళ్లు, ఆంధ్రోళ్లు అంటూ అప్పుడప్పుడు ఆంధ్రావారిపై విమర్శలు కూడా చేశారు. మరి అలాంటిది ఇప్పుడు ఈ నవ్యాంధ్ర శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారా? అదీకాక కొత్తగా విడిపోయిన  రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో పోటి నెలకొంది.. రాష్ట్రాల మధ్య అనడం కంటే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అనడం కరెక్ట్.  రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి.. పెట్టుబడులు తేవడానికి ఇద్దురూ పోటీ పడిమరీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అన్నింటికి మించి ఓటుకు నోటు కేసు.. ఈ ఒక్కటీ చాలు వీరిద్దరి మధ్య వార్ ఏరకంగా సాగిందో.. ఏ రకంగా ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారో చెప్పడానికి. మరి అంతలా వాదులాడుకున్న ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారా?రారా?అనేది అందరి సందేహం.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన ప్రత్యర్ధి అయిన కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తానే స్వయంగా పిలువనున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం అయింది. ఈసందర్బంగా శంకుస్థాపనకు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఎలా ఆహ్వానించాలనే దాని పైన చర్చించగా రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని నేనే కెసిఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానని మంత్రులతో చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. మరి రాజకీయంగా ఎన్ని ఉన్నా చంద్రబాబు అవన్నీ మరిచిపోయి కేసీఆర్ ను ఆహ్వానించడానికి తానే స్వయంగా వెళుతున్నారు మరీ కేసీఆర్ చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి శంకుస్థాపనకు వస్తారో?రారో చూడాలంటే శంకుస్థాపన వరకూ ఆగాల్సిందే.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov