http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 14:05 by Unknown   No comments

  • 30 రోజుల్లో లైసెన్స్‌
  • 15 రోజుల్లో రెన్యువల్‌
  • నిబంధనలూ సరళతరం
  • జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ
  • ఆమోదించిన స్టాండింగ్‌ కమిటీ
  • సర్కారుకు ప్రతిపాదన
హైదరాబాద్‌: మీరు వ్యాపారం చేస్తున్నారా..? ట్రేడ్‌ లైసెన్స్‌ లేదా..? అయితే ఇక భారీ జరిమానా చెల్లించక తప్పదు. అనుమతి లేకుండా వ్యాపారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చట్ట సవరణను ఆమోదిస్తు ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. గ్రేటర్‌లో 1.7 లక్షల ట్రేడ్‌ లైసెన్స్‌ల ఉన్నాయి. అనుమతి లేకుండా వ్యాపారం చేసే వారు అధికం. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై కొరడా ఝుళిపించేందుకు అంతగా కోరలు లేని నిబంధనలను సవరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ట్రేడ్‌ లైసెన్స్‌ లేకున్నా.. అంత సీరియ్‌సగా పరిగణించడం లేదు. ఒకవేళ తనిఖీల్లో గుర్తించినా.. నామమాత్రపు జరిమానా విధిస్తున్నారు. సవరిత నిబంధనల్లో భాగంగా అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే.. ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుము అంచనా వేసి దానికి 100 శాతం అదనంగా జరిమానా వసూలు చేయనున్నారు. ఓ వైపు చర్యలకు శ్రీకారం చుడుతూనే.. సులభతరంగా లైసెన్స్‌లు జారీ చేయాలని నిర్ణయించారు. సిటిజన్‌ చార్టర్‌ ప్రకారం ప్రస్తుతం 90 రోజులుగా ఉన్న ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ గడువును 30 పనిదినాలకు కుదించారు. రెన్యూవల్‌ చేసే సమయాన్ని 15రోజులకు తగ్గించారు. ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తుల స్వీకరణ, జారీ అంతా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. నిబంధనలనూ సరళరతం చేశారు. ఓనర్‌ షిప్‌ డాక్యుమెంట్‌ లేదా రెంటల్‌ అగ్రిమెంట్‌లో ఏదో ఒక ధృవీకరణతోపాటు.. గుర్తింపు కార్డు ఉంటే ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ చేస్తారు. స్థిరాస్తుల లీజు సంబంధిత అంశాన్ని వాయిదా వేశారు. ఆరోగ్యం, పారిశుధ్య విభాగంలో పనిచేస్తోన్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు పెంచాలన్న ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చిన సినీమాటోగ్రఫి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను స్టాండింగ్‌ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov