http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 14:04 by Unknown   No comments
డ్రగ్‌రాకెట్‌ నడుపుత్ను వారి బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే వీళ్లంతా బాగా తెలివైన వాళ్లు , ఎంతో చదువుకున్న వాళ్లు .మంచి జాబ్స్‌ ఉన్నాయి. ఎక్కడ లైఫ్‌ దారితప్పిందో తెలియదు కానీ.. మొత్తం సొసైటీకే ప్రమాదకరంగా తయారయ్యారు.
  • కాల్విన్‌ మస్కరాన్హస్‌ - ప్రముఖ కార్పొరేట్‌ బ్యాంకులో ఉద్యోగం
  • దండు అనిష్‌ - ఏరోస్పేస్‌ ఇంజనీర్‌
  • మైక్‌ కమింగా - ప్రముఖ సంస్థలో ఆర్కిటెక్ట్‌
  • మత్తుదారిలో ఉన్నత విద్యావంతులు
  • కిక్‌ ముఠాల మధ్య సన్నిహిత సంబంధాలు
  • ఇప్పటి వరకూ అరెస్టయిన నిందితుల కాల్‌డేటా సేకరణ
  • ఈజీగా దొరికే మజా.. మనీ కోసమే అడ్డదారులు
  • స్నేహితుల ఒత్తిడితోనే అధికశాతం తప్పిదాలు
  • వెలుగులోకి మాదకద్రవ్యాల రాకెట్‌ లోగుట్టు
హైదరాబాద్‌సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రోడ్‌సైడ్‌ రోమియో.. క్రిమినల్‌.. పిక్‌పాకెటర్‌... రాబరీ గ్యాంగ్స్‌.. పేరేదైనా.. వీళ్ల టార్గెట్‌. వీలైనంత కొట్టేయటం.. అవసరమైతే ఎంతకైనా తెగించటం. అడ్డొస్తే ఖతం చేయటం.. బాల్యం నుంచి ఇటువంటి వాతావరణంలోనే పెరిగారు. నేరగాళ్లుగా తయా రయ్యారు. కానీ.. ఇక్కడ. నాసా సైంటిస్ట్‌.. క్లాస్‌ ఫస్టొచ్చే స్టూడెంట్‌.. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చే గిటారిస్ట్‌.. క్రియేటివిటీతో పనిచేసే ఆర్కిటెక్ట్‌.. ఒకదానికొకటి సంబంధంలేని వృత్తుల్లో కొనసా గుతున్న వీరంతా.. ఒక్క విషయంలో మాత్రం కలిశారు. ఉన్నతవిద్యతో ప్రపంచానికి ఉపయోగ పడాల్సిన జ్ఞానాన్ని పక్కదారి పట్టించారు. డ్రగ్‌మాఫియా వలలో చిక్కి తప్పటడుగులు వేశారు. సరిదిద్దుకోలేనంతటి తప్పులు చేశారు. బడికెళ్లే.. పిల్లాడి నుంచి ఆఫీసుకెళ్లే ఐటీ నిపుణుడి వరకూ.. ప్రాణాంతకమైన డ్రగ్స్‌ అలవాటు అయ్యేందుకు కారణమయ్యారు. కొత్తగా రోజుకో ముఠా ఆనవాళ్లు వెల్లడవుతుండటంతో.. అధికారులు.. ఇప్పటి వరకూ అరెస్టయిన నిందితులకు ఒకరితో ఒకరికి వున్న సంబంధాలపై దృష్టిసారించారు. పార్టీలు.. సరుకు పంపిణీలతో కొందరికి సన్నిహిత సంబంధాలు న్నట్లుగా భావిస్తున్నారు. డ్రగ్స్‌ లింకులపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
 
మత్తుగా చిక్కి
  • దండు అనిష్‌ డెహ్రాడూన్‌ పాఠశాలలో చదివాడు. ఎరోస్పేస్‌ ఇంజనీర్‌. ప్రతిష్ఠాత్మకమైన అమెరికా ప్రయోగశాల నాసాలో పనిచేశాడు. డార్క్‌వెబ్‌సైట్‌ ద్వారా ఎండీఎంఏ, ఎల్‌ఎ్‌సడీ తెప్పించేవాడు. తాను వినియోగిస్తూ.. వ్యాపారంగా మలచుకున్నాడు. ఇతడితో పాటు అరెస్టయి రీతూఅగర్వాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాడు. ప్రముఖ కంపెనీలో ఉన్నతహోదాలో పనిచేస్తున్నాడు. అనిష్‌ ద్వారా వచ్చే సరుకును ఇతడే కస్టమర్స్‌కు చేరవేసేవాడు. వీరిద్దరిగీ నెదర్లాండ్‌ డ్రగ్‌ ముఠాలతో సంబంధాలున్నట్లు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్ధారించారు.
  • కాల్విన్‌ మస్కరాన్హస్‌ పాతికేళ్ల ఈ కుర్రాడు ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. కొద్దికాలం ప్రముఖ కార్పొరేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. మంచి వేతనం. ఉన్నత కుటుంబం. ఒత్తిడి.. సరదా.. రెండింటి కోసం గంజాయికు అలవాటయ్యాడు. అదీ స్నేహితుడి సూచనతో తొలిసారి సికింద్రాబాద్‌ లోనే 10 గ్రాముల గంజాయి కొనుగోలు చేశాడు. తాను ఇష్టపడే గిటార్‌ను నేర్చుకున్నాడు. మత్తు.. సంగీతం.. రెండిటినీ ఆస్వాదించేవాడు. ఈ సమయంలో జరిగిన యాక్సిడెంట్‌తో ఇంటికే పరిమితమయ్యాడు. అర్ధరాత్రి బోయినపల్లిలోని తన డాబాపైకి చేరి గిటార్‌ వాయిస్తూ ఇబ్బంది కలిగించాడంటూ రెండుసార్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు మత్తు సరఫరాను మార్గంగా మలచుకున్నాడు. డార్క్‌నెట్‌ ద్వారా ఎండీఎంఏ, ఎల్‌ఎ్‌సడీ తెప్పించుకుని పార్టీలు, పబ్‌లకు చేరవేసేవాడు. ఇంట్లో ఉంటూనే.. ఇతడు ఏజెంట్ల ద్వారా వ్యవహారం నడిపించేవాడు.
  • నెదర్లాండ్‌కు చెందిన మైక్‌ కమింగా ప్రముఖ సంస్థలో ఆర్కిటెక్ట్‌. వెబ్‌డిజైనింగ్‌, టెక్నాలజీ సేల్స్‌, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌ వంటి టెక్నికల్‌ అంశాల్లో ఎంతో ప్రావీణ్యం ఉంది. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డమ్‌లోని డబ్ల్యూ 3 అనే కంపెనీ సీవోవోగా గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దేశాలన్నీచుట్టొచ్చే ఇతడు పార్టీ కల్చర్‌ ద్వారా మత్తుకు చేరువయ్యాడు. సముద్రమార్గం ద్వారా ప్రయాణించే సమయంలో డ్రగ్‌ మాఫియాకు పరిచమయ్యాడు. క్రమేణా.. దేశవిదేశాల్లో ఏజెంట్స్‌ ద్వారా నిషేధిత మత్తుపదార్థాలను చేరవేయసాగాడు.
  • మెక్‌డొనాల్డ్‌ కెమారూన్‌ దేశస్తుడు. 2015లో స్టూడెంట్‌ వీసామీద హైదరాబాద్‌ చేరాడు. యూసు్‌ఫగూడలోని ఓ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. గోల్కొండలోని బృందావన్‌కాలనీలో నివాసం ఉండేవాడు. తనతో ఉండే నైజీరియన్స్‌ తక్కువ ధరకు కొకైన్‌ తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్మటం గమనించాడు. పాల్‌ అనే వ్యక్తి నుంచి కొకైన్‌ గ్రాము రూ.3000లకు కొని.. పబ్స్‌, కాఫీక్లబ్స్‌లోని కస్టమర్స్‌కు రూ.5000- 6000 వరకూ డిమాండ్‌కు అనుగుణంగా విక్రయిస్తూ తేలికగా డబ్బు సంపాదించటానికి అలవాటుపడ్డాడు.
  • మారేడుపల్లి ప్రాంతానికి చెందిన పియూష్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. గతేడాది ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయటంతో సదరు కంపెనీ ఇతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. చదువుకునే సమయంలో కొద్దిగా అలవాటుతున్న గంజాయికు మళ్లీ చేరువయ్యాడు. గంజాయి బ్యాచ్‌లో.. ఒక మిత్రుడు ఇచ్చిన సూచనతో ఎల్‌ఎ్‌సడీ తెప్పించుకుని వాడాడు. ఖరీదు ఎక్కువగా ఉండటం.. దొరకటం కూడా కష్టంగా మారింది. డార్క్‌నైట్‌ ద్వారా ఎల్‌ఎ్‌సడీ కొరియర్‌ ద్వారా తెప్పించుకునేవాడు. గంజాయి గ్యాంగ్‌లోని వారికే ఎల్‌ఎ్‌సడీ విక్రయించేవాడు. అలా.. కస్టమర్స్‌ సంఖ్య పెరగటంతో.. పియూష్‌ ఆలోచనలో మార్పు వచ్చింది. మత్తు, లైంగికప్రేరణను కలిగించే మందుల గురించి ఇంటర్నెట్‌లో వెతికాడు. వయాగ్రా, పెనాగ్రా, అక్సెప్టా తదితర ట్యాబ్లెట్స్‌కు పౌడర్‌గా మార్చి తానేస్వయంగా ట్యాబ్లెట్స్‌గా తయారు చేయటం ప్రారంభించాడు. ఎల్‌ఎ్‌సడీ కలరింగ్‌ ఇచ్చి కస్టమర్స్‌కు విక్రయిస్తూ కొద్దికాలంగా బిజినెస్‌ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే డ్రగ్‌ రాకెట్‌ గుట్టు బయటపడటంతో.. పియూష్‌ కూడా పోలీసుల చేతికి చిక్కాడు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov