http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 20 July 2017

On 12:27 by Unknown   No comments
ఎన్టీఆర్ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ షో ఎపిసోడ్ 4తో సందడి చేశారు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సెలబ్రిటీలు. నిజానికి బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు, ఎఫైర్‌లు, డ్రామాలతో ఆసక్తికరంగా సాగుతుంది. హిందీలో పాపులర్ కావడానికి ఈ కాంట్రవర్శిలే ప్రధాన కారణం. దీంతో తెలుగులో కూడా మెల్లమెల్లగా వివాదాలను మొదలు పెట్టి షో రంజుగా సాగేందుకు సెలబ్రిటీలు పోటీ పడుతున్నారు. ఇక నాలుగో ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. జ్యోతి యోగా క్లాస్‌లో సంపూర్ణేష్ బిజీగా ఉంటే ఇద్దరికీ ఏం రాదు అంటూ బిల్డప్ ఇస్తున్నారు అంతే అంటూ ధనరాజ్ పంచ్ వేయడం, లగ్జరీ బడ్జెట్ టాస్క్‌‌లో భాగంగా హోమం ఆరకుండా చూసుకునే టాస్క్‌లో హరిప్రియ, అర్చన, మధుప్రియలు హోమం దగ్గర ఉండటంతో.. మధుప్రియ అర్చనల మధ్య చిన్న వివాదం రేగింది. ఇది మధు ప్రియ ఏడ్చేవరకూ వెళ్లింది.

ఇక కెప్టెన్ సంపూర్ణేష్ తనకు నచ్చలేదని.. తిండానికి మాత్రమే వస్తున్నాడంటూ ముమైత్ సంపూర్ణేష్‌పై సెటైర్ వేయగా.. హరితేజ, ప్రిన్స్, ఆదర్శల మధ్య రేగిని వివాదం ఈ ఎపిసోడ్‌లో హైలైట్ అయ్యింది. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఆదర్శ్.. ప్రిన్స్‌ని ఉద్దేశించి బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి కాకుండా ఉన్నది నువ్ ఒక్కడివే కదా అంటే.. పక్కనున్న హరిప్రియ పర్శనల్ విషయాలు ఇక్కడ అవసరమా అంటూ ఆదర్శ్‌పై ఫైర్ అయ్యింది. దీంతో ప్రిన్స్ కలుగజేసుకుని తాను క్యాజువల్‌గానే అడిగాడని అనడంతో నువ్ ఎందుకు మధ్యలో వస్తున్నావ్ అంటూ ప్రిన్స్‌పై సీరియస్ కావడం.. అదే రేంజ్‌లో ప్రిన్స్ కూడా ఫైర్ అవ్వడం.. ఈ గొడవను మొత్తం గమనిస్తున్న బిగ్ బాస్ హౌస్ కెప్టెన్.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘సన్న పిన్ను చార్జర్ ఉందా భయ్యా’ అంటూ అక్కడ ఉన్న సీనియస్ వాతావరణాన్ని తన జోక్‌తో ఒక్కసారిగా మార్చేశాడు. తరువాత కూడా వీరి మధ్య గిల్లికజ్జాలు కంటిన్యూ అయ్యాయి. హరితేజ ఎమోషన్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆదర్శ్, ప్రిన్స్ సారీ చెప్పి కూల్ చేసేశారు.     

మరోవైపు బిగ్ బాస్‌లో సీక్రెట్ టాస్క్‌ను సమీర్ కిచెప్పారు. దీనిలో భాగంగా అందరికీ లగేజ్ బ్యాగ్‌లలో ప్రిన్స్, ముమైత్ ఖాన్, ధనరాజ్, సంపూర్ణేష్ సూట్ కేసులను వెనక్కి రాకుండా సమీర్ చేయాలని అలా చేయలేని పక్షంలో సమీర్‌కు ఎలిమినేషన్ తప్పదని బిగ్ బాస్ సమీర్‌కు హుకుం జారీ చేశారు . ఈ సీక్రెట్ టాస్క్‌ను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మిగతా సభ్యలకు లీక్ చేయకూడదని బిగ్ బాస్ కొత్త టాస్క్‌కు సమీర్ సై అన్నాడు. మరి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో తేలనుంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov