http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 13:57 by Unknown   No comments
న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 
వరకట్న వేధింపులకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేయటం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టులకు ముందు ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణను జరపాలని, ఆ తర్వాతే చర్యకు ఉపక్రమించాలని స్పష్టం చేసింది.
భర్త, అతని తరఫు బంధువుల వేధింపుల నుంచి భార్యకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన చట్టం దుర్వినియోగం అవుతున్నందున ప్రతి జిల్లాలోనూ కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
Dowry law: First examine complaint then arrest SC says in landmark verdict
వేధింపులపై ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ కమిటీలు పరిశీలించి నివేదిక సమర్పించిన తర్వాతే చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఆ కమిటీల విధివిధానాలనూ న్యాయస్థానం నిర్దేశించింది.
రాజేశ్‌ శర్మ అనే వ్యక్తి అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఏకే గోయెల్‌, యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పునిచ్చింది. వరకట్న హింస నిరోధక చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఆ చట్టానికి తగిన సవరణలు చేయాలని కేంద్ర న్యాయశాఖను కోరింది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov