http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 26 July 2017

On 20:33 by Unknown   No comments
మలయాళ ‘ప్రేమమ్‌’లో మలార్‌ పాత్రలో నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది సాయిపల్లవి. తాజాగా శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో భానుమతిగా నటించిన సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ‘ఆనంద్‌’లో రూప, ‘గోదావరి’లో సీతామహాలక్ష్మి తరహాలో ఈ భానుమతి క్యారెక్టర్‌ను మలిచాడు శేఖర్‌. తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్‌ చెప్పిన సాయిపల్లవి క్యారెక్టరే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. దీంతో ఈ నేచురల్‌ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దిల్‌ రాజు ఈమెతో వరుసగా మూడు సినిమాలు నిర్మిస్తున్నారు. నానితో నిర్మించనున్న ‘ఎమ్‌సీఏ’ సినిమాలో సాయిపల్లవినే హీరోయిన్‌గా తీసుకున్నారు దిల్‌ రాజు. అలాగే శర్వానంద్‌, నాగశౌర్య సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది సాయిపల్లవి. ఇక, సాయిపల్లవి నటించడం వల్ల మలయాళంలో కూడా ‘ఫిదా’కు డిమాండ్‌ పెరుగుతోందట. ఆ సినిమాను మలయాళంలోకి డబ్బింగ్‌ చేయమని ఒత్తిడి చేస్తున్నారట. మొత్తానికి సాయిపల్లవి తెలుగులో కూడా స్టార్‌ స్టేటస్‌ అందుకుని అవకాశాలు దక్కించుకుంటోంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov