http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 20 July 2017

On 12:15 by Unknown   No comments
హైదరాబాద్: రాజధానిలోని ఘోషామహల్ ప్రాంతంలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్ కనిపించింది. ఓ ఫ్లై వుడ్ షాపులో దాక్కున్న ఈ పామును స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇంతవరకు ఇలాంటి స్నేక్‌ను చూడలేదని వారు చెబుతున్నారు. ఘోషామహల్ ప్రాంతంలోని ఓ దుకాణదారుడు తమకు ఫోన్ ద్వారా దీని గురించి సమాచారం అందించాడని ఫ్రెండ్స్ అండ్ స్నేక్ సొసైటీ సంయుక్త కార్యదర్శి అరుణ్ కుమార్ అన్నారు. తన ఫ్లైవుడ్ షాపులో చిన్న పాము ఉందని, సహాయం చేయాలని కోరినట్లు అరుణ్ పేర్కొన్నారు.Surprise visitor: Flying snake found in Hyderabad
షాప్ అతని అభ్యర్థన మేరకు తాము అక్కడకు వెళ్లామని, అయితే తాము భావించినట్లు అది సాధారణ పాము కాదని అరుణ్ అన్నారు. రాట్ స్నేక్ లేదా కోబ్రా అయి ఉంటుందని తొలుత భావించామని, కానీ ఒక్కసారిగా అది ఎగరడంతో ఆశ్చర్యపోయామని అన్నారు. జాగ్రత్తగా పట్టుకుని సైనిక్ పురి ప్రాంతంలోని తమ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. ఇది విషపూరితమైన పాము అని, పశ్చిమ కనుమలు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, కొన్ని ఆసియా దేశాల్లో ఇది సాధారణంగా కనిపిస్తుందని తెలిపారు. పామును సంరక్షిత కేంద్రానికి తరలించామని స్పష్టం చేశారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov