http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 8 August 2017

On 11:31 by Unknown   No comments

బెంగళూరు: భీమ్ యాప్ వినియోగదారులకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భీమ్ యాప్‌తో డిజిటల్ చెల్లింపులు చేస్తున్న యూజర్లకు ఈ ఆఫర్లు ప్రకటించనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తున్న భీమ్ యాప్... యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తో పనిచేస్తుంది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు. క్యాష్ బ్యాగ్ ఆఫర్ల పెంచాలన్న ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నాయనీ.. ఆగస్టు 15 నాటికి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్‌పీసీఐ ఎండీ, సీఈవో ఏపీ హోటా పేర్కొన్నారు. అదే రోజు భీమ్ కొత్త వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు.
 
ఓ జాతీయ మీడియా సంస్థతో హోటా మాట్లాడుతూ.... ‘‘మరింత మంది వినియోగదారులు భీమ్ యాప్ వినియోగించాలంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ల మొత్తాన్ని మరింత పెంచాలని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం. ఆగస్టు 15 నాటికల్లా ఇవి అమల్లోకి వస్తాయని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 నుంచి రూ.25 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయన్నారు. గ్లోబల్ పెట్టుబడిదారుల అండతో పేటీఎం, ఫోన్‌పే తదితర పేమెంట్ యాప్‌లు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో వినియోగదారులు వాటివైపు మొగ్గుచూపుతున్నట్టు భావిస్తున్న భీమ్... క్యాష్ బ్యాక్ ఆఫర్ల మొత్తాన్ని పెంచాలని యోచిస్తోంది. కాగా ఆరు నెలలకు గానూ క్యాష్ బ్యాక్ ఆఫర్ల కోసం వినియోగించేందుకు ఏప్రిల్ 14న కేంద్రప్రభుత్వం రూ.450 కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా జూన్ నాటికి 1.6 కోట్ల మంది భీమ్ యాప్ వినియోగదారులుండగా.. 40 లక్షల మంది యాక్టివ్‌ కస్టమర్లు ఉన్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov