http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 23 March 2015

On 18:03 by Unknown   No comments
హైదరాబాద్ : కొరటాల శివ దర్శకత్వంతో మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం (శ్రీమంతుడు)రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన్ను ఆట పట్టించే కొంటె మరదలుగా నటిస్తున్నట్లు వర్ధమాన నటి కారుణ్య చౌదరి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా బయ్యనగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యి ఈ విషయం తెలియచేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కారుణ్యం చౌదరి మాట్లాడుతూ...బయ్యనగూడెం గ్రామానికి చెందిన నాగబాబు కోరిక మేరకు అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి మరికొందరు నటులు, డెరైక్టర్లు, కో-డెరైక్టర్లతో రెండ్రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కాకినాడకు చెందిన తాను హైదరాబాద్‌లో స్థిరపడినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం తననెంతో ఆకర్షించినట్టు తెలిపారు. ఇంతకు ముందు శ్రీమంతుడు సినిమాలో నటించానని తెలిపారు.
మహేష్‌బాబుకు ఈమే మరదలిగా చేస్తోంది(ఫొటో)
చిత్రం విశేషాలకు వస్తే...
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం (తాత్కాలిక టైటిల్ శ్రీమంతుడు) రిలీజ్ డేట్ ఖరారైంది. షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జులై 17న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని సమాచారం. రీసెంట్ గా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని అమ్మారని అదీ రికార్డు రేటుకు అని చెప్తున్నారు. క్లాసిక్ ఎంటర్నైమెంట్ వారు..ఈ రైట్స్ ని 8.1 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వినికిడి. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు ఈ రేటు రాలేదు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ..అత్తారింటికి దారేది, మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలే ఎక్కువ రేట్ తో నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాయి. ఇప్పుడు తన రికార్డుని తనే మహేష్ బ్రద్దలు కొట్టుకున్నారు.
మహేష్‌బాబుకు ఈమే మరదలిగా చేస్తోంది(ఫొటో)
ఈ చిత్రంలో మహేష్ బాబు మల్టీ మిలియనీర్(ధనవంతుడు)గా కనిపించబోతున్నాడు. ఇందులో అతని లుక్, స్టైల్ పూర్తిగా డిఫరెంటుగా కనిపించబోతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తోంది. జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నీ చిత్రానికి ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్, ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov