http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 23 March 2015

On 18:01 by Unknown   No comments
akil-rasi
అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో అఖిల్ సరసన అందాల తార రాశిఖన్నా ఐటం సాంగ్ చేస్తుందంటూ వస్తున్న వార్తలను ఖండించింది. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశిఖన్నా. అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో వారసుడు అఖిల్ తొలి చిత్రంలో రాశిఖన్నా ఐటం సాంగ్ చేస్తోందన్న వార్తలు వచ్చాయి. 
 
ఈ విషయం గురించి రాశిఖన్నా మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాననీ.. ఏ సినిమాలోనూ ఐటం సాంగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. అఖిల్‌తో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని తెలిపింది. ప్రస్తుతం 'జిల్' మూవీ  ప్రమోషన్ లో బిజీగా ఉన్నాననీ,  అలాగే  బెంగాల్ టైగర్  సినిమా  షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోందని తెలిపింది.  
 
జిల్ చిత్రంలో గోపీచంద్ తో స్క్రీన్ పంచుకున్న ఈ అమ్మడు...'జోరు' కొనసాగుతోంది.  ప్రస్తుతం కిక్ -2,  బెంగాల్ టైగర్  సినిమాల్లో రవితేజతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov