http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 23 March 2015

On 17:53 by Unknown   No comments
renu-pawan
తన భార్య రేణు దేశాయ్ నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పిల్లలు అకీరా, ఆధ్యాల విషయంలో తండ్రిగా తన బాధ్యతను ఎన్నడూ మరువలేదు. తాజాగా పవన్ కూతురు ఆధ్యా పుట్టిన రోజు పండుగ సందర్భంగా ఆయన సోమవారం పూనా వెళ్లారు. 
 
అక్కడ ఆయన పిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా పవన్ తన చిన్నారి ఆధ్యాను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముచ్చటిస్తున్న ఫోటోగ్రాఫ్‌ను రేణు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 
 
'అందరికీ ఆయన ఒక నటుడు, ఒక లీడర్, ఒక స్టార్, ఒక రాజకీయనాయకుడు. కానీ, ఆమెకు మాత్రం కేవలం నాన్న మాత్రమే...' అంటూ పోస్ట్ కూడా ఇచ్చింది. అయితే, ఈ ఫోటోలో పవన్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో పూర్తి ఫోటోను పోస్ట్ చేయమంటూ అభిమానులు అడిగారు.
 
దానికి సమాధానం చెబుతూ, "ఇది ఒక తండ్రి, తనయ మధ్య చోటు చేసుకున్న అందమైన మధురక్షణం అన్న విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఆ బంధాన్ని ఆస్వాధించండి, పూర్తి ఫోటో కావాలని మాత్రం ఫిర్యాదు చేయకండి" అని రిక్వెస్ట్ చేస్తూ రేణు ట్వీట్ చేసింది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov