http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 23 March 2015

On 18:00 by Unknown   No comments


నిఖిల్‌ హీరోగా ‘శంకరాభరణం’ సినిమా శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఉదయ నందనవనమ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కోన వెంకట్‌ సమర్పణలో గతేడాది ‘గీతాంజలి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎమ్‌.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాకు నిర్మాత. కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘‘బీహార్‌ నేపథ్యంలోసాగే క్రైమ్‌, కామెడీ సినిమా ఇది. అలనాటి ‘శంకరాభరణం’కు ఈ సినిమాకు దీనికి ఏ సంబంధం లేదు. కథానుగుణంగా ఈ టైటిల్‌ పెట్టాం. నిఖిల్‌ సరసన ఓ పాపులర్‌ హీరోయిన్‌ని ఎంపిక చేస్తాం’’ అని అన్నారు. ‘గీతాంజలి తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. కోన వెంకట్‌ చక్కని కథ ఇచ్చారు. మే రెండోవారంలో చిత్రీకరణ ప్రారంభించి దసరాకు సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత ఎమ్‌.వి.వి.సత్యనారాయణ తెలిపారు. రావు రమేశ్‌, సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, సుజాయ్‌ మిశ్రా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, సంగీతం:ప్రవీణ్‌ లక్కరాజు, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రామన్‌చౌదరి.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov