http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 13 April 2015

On 18:17 by Unknown   No comments
అక్కినేని నాగచైతన్య, కృతిసనన్ జంటగా స్వామిరారా ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘దోచేయ్’. ఈ చిత్రంలోని పాటలు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని నాగార్జున ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి సీడీని సంగీత దర్శకుడు కీరవాణికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కథ విన్నప్పుడు చాలా కొత్తగా అన్పించిందని, అలాగే పోస్టర్లు చూసినపుడు, పాటలు విన్నప్పుడుకూడా అదే ఫీలింగ్ కలిగిందని అన్నారు. ట్రైలర్స్ చాలా బాగున్నాయని, ఆడియన్స్‌కు ఓ కొత్త ఫీలింగ్‌ను కలిగించే చిత్రంగా నిలుస్తుందని అన్నారు. చైతన్యకి ఈ సినిమా ఒక మంచి హిట్‌ను అందిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి మాట్లాడుతూ, నిర్మాత ప్రసాద్ సినిమా అంటే ఎంతో తపన వున్న వ్యక్తిఅని, మంచి సినిమా కోసం ఎలాంటి కష్టమైనా పడతారని, స్వామిరారా సినిమాకు దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న సుధీర్‌వర్మ ఈసినిమాతో పెద్ద విజయాన్ని అందుకుంటాడని అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తన దగ్గర అసిస్టెంట్‌గా చేసిన సుధీర్ వెళ్లిపోవడం బాధనిపించిందని, సినిమాపట్ల కమిట్‌మెంట్ వున్న వ్యక్తి అని, తన మొదటి సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడని అన్నారు. తాను కొన్ని సీన్స్ తీయాలంటే చాలా టెన్షన్ పడతానని, కానీ సుధీర్ మాత్రం కూల్‌గా, తక్కువ టైమ్‌లో మంచి ఔట్‌పుట్ ఇచ్చాడని అన్నారు. ‘దోచేయ్’ పాటలు, ట్రైలర్ బాగున్నాయని, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ, రెండు వారాల క్రితమే ఈ పాటలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశామని, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.
మొదటిసారి నాకు ఇలాంటి క్రేజీ ఆల్బమ్ దక్కడం ఆనందంగా ఉందని, ఈ సినిమాలో నన్ను సుధీర్ కొత్తగా ప్రెజెంట్ చేశాడని అన్నారు. హీరోయిన్ కృతిసనన్ మాట్లాడుతూ ఈ సినిమాకు పనిచేయడం అద్భుతంగా అనిపించిందన్నారు. సుధీర్‌కు మంచి విజన్ ఉందని, చైతుతో పనిచేయడం ఎంజాయ్ చేశానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, పోసాని, కరుణాకరన్, చందూ మొండేటి, సుశాంత్ పాల్గొన్నారు.
చిత్రం... ‘దోచేయ్’ ఆడియో వేడుకలో రాజవౌళి, కృతిసనన్, కీరవాణి, నాగార్జున, ప్రసాద్, నాగచైతన్య తదితరులు

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov