http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 13 April 2015

On 18:17 by Unknown   No comments
 ప్రభాస్ ప్రవర్తన అలా ఉండేదా? ఐటం బ్యూటీ ఏం చెప్పింది?హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి హాట్ అండ్ సెక్సీ ఐటం గర్ల్ స్కార్లెట్ విల్సన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రభాస్ చాలా సిగ్గరి, అతను చాలా రిజర్వుగా ఉంటారని, బాహుబలి షూటింగులో ఆయనతో మాట కలపడానికి మూడు రోజుల సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బహుబలి చిత్ర షూటింగులో భాగంగా ఐటం సాంగ్ చిత్రీకరించారు. ప్రభాస్‌తో పాటు స్కార్లెట్ విల్సన్, నోరా ఫతేహి, స్నేహా ఉపాధ్యాయలతో ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ ఐటం సాంగ్ చిత్రీకరణ సాగింది. ఈ ఐటం సాంగ్ చిత్రీకరించటానికి ఎనిమిది రోజులు పట్టిందట.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం యూనిట్ సంప్రదాయబద్దంగా గుమ్మిడికాయ కొట్టే తంతుని నిర్వహించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగా మే నెలలో విడుదల కానుంది. తెలుగులో సినిమా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన చిత్రంగా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే
15న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov