http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 17 April 2015

On 18:03 by Unknown   No comments
ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి సంచలనానికి తెరతీయనున్నారు. అయితే ఈ సారి ఆయన వ్యాఖ్యల్లో కాకుండా చేతల్లో సంచలనం సృష్టించనున్నారు. 
 
తమిళనాడులో పేరు పొందిన గంధపు చెక్కల వీరప్పన్‌పై రామ్ గోపాల్ వర్మ చిత్రం చేయనున్నట్టు సమాచారం. వీరప్పన్ జీవిత చరిత్రతో చిత్రం చేయాలన్నది వర్మ ఎనిమిదేళ్ల కిందటి ఆలోచనట. ఈ చిత్రం వ్యవహారంలో అప్పుడే వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మితో సంప్రదింపులు జరిపి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. 
 
అయితే ఈ విషయాలు ముత్తులక్ష్మి ఇటీవల వెల్లడించారు. ఈ సందర్భంగా ముత్తు లక్ష్మి మాట్లాడుతూ వీరప్పన్ చిత్రం గురించి అంతర్జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడాలని తాను కోరగా, వర్మ తనకు కొన్ని ఆలోచనలు కూడా చెప్పినట్టు తెలిపారు. 
 
తన భర్తకు సంబంధించిన మరికొన్ని కీలక విషయాలను కూడా ఆయన తన వద్ద అడిగి తెలుసుకున్నారని ముత్తు లక్ష్మి వెల్లడించారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్‌పైకి తీసుకువచ్చేందుకు వర్మ తీవ్ర సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov