http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 20 August 2015

On 22:21 by Unknown   No comments

Ravi Teja About Kick 2 and Kick 3 Movies
సురేందర్ రెడ్డితో కిక్‌తో హిట్ కొట్టిన రవితేజ ఇప్పుడు అదే దర్శకుడితో కిక్-2 అంటూ సందడి చేయబోతున్నాడు. కిక్-2 షూటింగ్ ఎప్పుడో పూర్తయినా టెక్నికల్ పనుల వల్ల విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు. కాగా ఆగష్టు 21న కిక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు రవితేజ అండ్ కో. కిక్ సినిమాకు సంగీతాన్నందించిన తమన్ ఈ సినిమాకు కూడా స్వరాలందించాడు. హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాడు.
కథా పరంగా కిక్ చిత్రానికి కిక్-2కి ఎలాంటి సంబంధం లేదని, సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కిక్-2 అనే టైటిల్ అయితేనే కరెక్ట్ అని బావించి ఆపేరు పెట్టామని రవితేజా తెలిపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై గతంలోనే చేయాల్సి ఉన్న సమయం కుదరక చేయలేదని చెప్పాడు. కిక్-2 తరువాత కిక్-3 కూడా చేయనున్నట్టు మాస్ మహారాజ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ చిత్రానికి కూడా సురేందర్ రెడ్డే దర్శకత్వం చేస్తాడని చెప్పాడు. అర్రే మరచితిమి పొడుగు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా అందాల విందు ఇవ్వనుంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov