http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 17 April 2015

On 17:59 by Unknown   No comments


‘భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది. విని మారకపోతే చచ్చాక వినపడుతుంది. యుద్ధానికి ముందు వింటావా? చచ్చాక వింటావా?’, ‘పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలోని ప్రతి పార్ట్‌లో ఓ పవర్‌ దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్‌ను టచ్‌చేసినా నీ బాడీ షేప్‌ మారిపోతుంది’... వంటి డైలాగులతో నందమూరి బాలకృష్ణ అభిమానులను, ప్రేక్షకులను అలరించడం గ్యారంటీ అని అంటున్నారు నిర్మాత రుద్రపాటి రమణారావు. బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘లయన్‌’. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పిస్తున్నారు. ఎస్‌.ఎల్‌.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్రిష, రాధికా ఆప్టే నాయికలు. నిర్మాత మాట్లాడుతూ ‘‘లెజెండ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ గారు నటించిన ‘లయన్‌’ ఆయన నటవిశ్వరూపాన్ని మరోసారి చాటి చెబుతుంది. ఆయన ఇమేజ్‌కి తగ్గ విధంగా సత్యదేవ తెరకెక్కించారు. నందమూరి అభిమానులు బాలకృష్ణగారిని ఎలా చూడాలనుకుంటారో, అలా ఉండే సినిమా ఇది. షడ్రసోపేతమైన మూవీ. ఫస్ట్‌ లుక్‌కీ, టీజర్‌కీ, థియేట్రికల్‌ ట్రైలర్‌కీ, మణిశర్మ పాటలకూ చాలా మంచి స్పందన వస్తోంది. ఆడియో వేడుకలో బాలయ్య చెప్పిన డైలాగులకు చక్కటి క్రేజ్‌ వచ్చింది. థియేటర్లలో డైలాగులను ఎప్పుడెప్పుడు విందామా అని అందరూ ఎదురుచూస్తుంటారనే విషయం మాకు తెలుసు. ఈ సినిమాను మే డే కానుకగా మే 1న విడుదల చేస్తాం. తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అని చెప్పారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov