http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 22 August 2015

On 05:23 by Unknown   No comments

త‌న అభిమాన హీరోతో డిన్నర్ అంటూ ఆశ‌పెట్టి ఆన‌క త‌ప్పించుకున్నందుకు గాను రూ.2.50 కోట్ల న‌ష్టప‌రిహారం ఇవ్వాలంటూ కోర్టుకెక్కిందో మ‌హిళ‌. హ‌ర్యానాకు చెందిన శిఖామొంగా 19 ఏళ్ల వ‌య‌సులో హృతిక్ రోష‌న్ వీరాభిమానిగా మారింది.  హృతిక్ తొలి సినిమా క‌హో నా ప్యార్ హై సినిమా ఒక వేవ్ సృష్టించిన విష‌యం తెలిసిందే.
ఆ సినిమా ఆమ్మాయిల‌కు హృతిక్‌ని ఎంత క్రేజీగా మార్చిందో కూడా తెలిసిందే. అదే స‌మ‌యంలో హృతిక్ పై యువ‌తుల్లో ఉన్న ఇష్టాన్ని త‌మ ప్రచారానికి ఉప‌యోగించుకోవాల‌నుకున్న కోకోకోలా ఒక కాంటెస్ట్ నిర్వహించింది.
అందులో గెలిచిన వారికి హృతిక్‌తో డిన్నర్ చేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తానంటూ ఆఫ‌ర్ ఇచ్చింది. ఆ ఆఫ‌ర్‌ను హ‌ర్యానాకు చెందిన శిఖా మొంగా గెలుచుకుంది. అయితే ఏళ్లు గ‌డుస్తున్నా స‌ద‌రు కూల్ డ్రింక్ కంపెనీ త‌న ప్రామిస్‌ను నెరవేర్చలేదు. అప్పటి నుంచి శిఖా... త‌ర‌చుగా కంపెనీ వ‌ర్గాల‌తో సంప్రదింపులు జ‌రుపుతూనే వ‌చ్చింది.
మ‌ధ్యలో కాంప్రమైజ్ అంటూ కంపెనీ ఒక ప్రపోజ‌ల్‌ను ఆమె ముందుకు తెచ్చింది. దాని ప్రకారం హృతిక్‌తో డేట్ విష‌యం శిఖా మ‌ర్చిపోతే... రూ. 5ల‌క్షలు కంపెనీ ప‌రిహారంగా చెల్లిస్తుంది. అయితే దీనికి కూడా శిఖా అంగీక‌రించ‌లేదు. దీంతో కంపెనీ వ‌ర్గాలు అంత‌కు మించి తామేమీ చేయ‌లేమ‌ని చేతులెత్తేశాయి.
ఈ నేప‌ధ్యంలో శిఖా కోర్టును ఆశ్రయించింది. తాను త‌న స్నేహితుల‌కు, బంధువుల‌కు అంద‌రికీ హృతిక్‌ను క‌ల‌వ‌బోతున్నాన‌ని గొప్పగా చెప్పుకున్నాన‌ని,  వాళ్లంద‌రూ  ప‌దే ప‌దే హృతిక్‌తో డిన్నర్ ఎప్పుడు అంటూ అడుగుతూ వ‌చ్చార‌ని, ఈ విష‌యంలో తాను ఎగ‌తాళికి వేళాకోళానికి గురై ప‌రువు పోగొట్టుకున్నాన‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తూ ఆమె కోర్టులో కేసు దాఖ‌లు చేసింది.
న‌ష్ట ప‌రిహారంగా కంపెనీ నుంచి రూ.2.50 కోట్లు డిమాండ్ చేసింది. కేసు విచార‌ణ‌లో భాగంగా ఇటీవ‌లే కోర్టు కూల్ డ్రింక్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు... బాధితురాలు స్థితిమంతురాలు కాదు కాబ‌ట్టి ఆమెకు కోర్టు ఫీజు కూడా మిన‌హాయింపునివ్వడం విశేషం. ప్రస్తుతం శిఖా వ‌య‌సు 34 ఏళ్లు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov