http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 22 August 2015

On 05:04 by Unknown   No comments

చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్‌ను కొట్టేంత పనిచేసింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ చుట్టు ముట్టి ఇబ్బంది పెడతారు. ఒకరు ఇద్దరు ఉంటే ఫర్వాలేదు కానీ... వందలమంది అభిమానులు ఉన్నచోట పరిస్థితి దారుణంగా ఉంటుంది. అదీ హీరోయిన్ల పట్ల కొందరు అభిమానులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  
 
గతంలో పలు సందర్భాల్లో హీరోయిన్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి అనుభవం ఎదుర్కొంది. తమిళ చిత్రం ‘పాయుమ్ పులి' మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా ఆమెను అభిమానులు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. దీంతో చిర్రెత్తిన కాజల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను వేధిస్తున్న అభిమానులను కొట్టినంత పని చేసింది. జరగండి జరగండి అంటూ కేకలు పెట్టేసింది. ఒక్కసారిగా అందరూ పైనబడటంతో మండిపడింది. చివరికి ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఆడియో ఫంక్షన్‌కి హాజరైంది. 
 
కాగా.. పాయుమ్ పులి' తెలుగులో ‘జయసూర్య' పేరుతో విడుదల కానుంది. పందెం కోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశాల్ కథానాయకుడిగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov