http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 26 August 2015

On 13:42 by Unknown   No comments

తమిళంలోనే కాదు తెలుగులోనూ తిరుగులేని స్టార్‌డమ్‌ కలిగిన కథానాయకుడు సూర్య, దర్శకుడు పాండిరాజ్‌ కాంబినేషన్‌లో ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సూర్య సరసన అమలాపాల్‌ నటిస్తుండగా, తెలుగు అమ్మాయి బిందుమాధవి ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని తమిళంలో సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ ఫ్యాన్నీ రేట్‌ చెల్లించి హక్కుల్ని పొందారు సాయిమణికంఠ క్రి యేషన్స్‌ అధినేత జూలకంటి మధుసూదన్‌రెడ్డి. కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థతో కలసి ఆయన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
 
ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ తమిళంలో సూపర్‌స్టార్‌ సూర్య నిర్మిస్తున్న సినిమాను ఆయన సమర్పణలో తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందరో పెద్ద నిర్మాతలు ఈ చిత్రం హక్కుల కోసం పోటీ పడినా మా మీద నమ్మకంతో హక్కులు మాకే ఇచ్చారు. ఇటీవలే ‘జిల్లా’ సినిమాని నిర్మించిన శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ అధినేతలు ప్రసాద్‌ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు’ అని తెలిపారు.
 
ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్య, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్ల, కూర్పు: ప్రవీన్‌ కె.ఎల్‌. కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: పాండిరాజ్‌.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov