http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 29 September 2015

On 05:20 by Unknown   No comments
మంచి ఉద్దేశంతో, మంచి సందేశంతో తీసిన ‘యంయస్‌జి-2’ చిత్రాన్ని చూడకుండానే జార్ఖండ్‌, చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌లో నిషేధించారనీ, నాగరికతకు దూరంగా ఉన్న గిరిజనుల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ, మాంసాహారం వల్ల కలిగే అనర్థాలను పొందుపరుస్తూ ఈ చిత్రాన్ని తీశాననీ గుర్మీత్‌ రామ్‌రహీమ్‌ సింగ్‌ చెప్పారు. హకీకత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై తయారైన ‘యంయస్‌జి-2.. ది మెసెంజర్‌’ చిత్రానికి ఆయన దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు, సంగీత దర్శకుడు కూడా. ఈ నెల 18న హిందీలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 1న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముంబైలో తెలుగు మీడియాతో ప్రత్యేకంగా సంభాషించారు రామ్‌రహీమ్‌ సింగ్‌.
 
ఆయన మాట్లాడుతూ ‘‘నేను కథానాయకుడిగా నటించి, నిర్మించిన ‘యంయస్‌జి’ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం సాధించింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తప్పుదోవ పడుతున్న యువతరం కోసం ఓ సందేశాన్నిస్తూ ఆ చిత్రాన్ని తీశాను. ప్రేక్షకుల ఆదరణ లభించడంతో, మంచిని వినోదాత్మకంగా సినీ మాధ్యమం ద్వారా చూపిస్తే కోట్లాదిమందికి చేరుతుందనీ, తద్వారా వారిలో మార్పు వస్తుందనే నమ్మకంతో, ఇప్పుడు ‘యంయస్‌జి-2’ తీశాను. హిందీ వెర్షన్‌ మొదటి వారంలోనే రూ. 102.88 కోట్ల గ్రాస్‌ను వసూలుచేసి, నా నమ్మకాన్ని నిజం చేసింది. మంచి విషయం చెబితే ప్రాంతం, భాషతో నిమిత్తం లేకుండా అందరూ చూస్తారు, ఆదరిస్తారనే ఉద్దేశంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించాం. వారు కూడా దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా. ఈ సినిమాలను సమాజంలో నిజంగా జరిగిన సంఘటనలను క్రోడీకరించి, దానికి కొంత నాటకీయతను జోడించి తీశాను. మొదటి సినిమాలో సెక్స్‌వర్కర్ల పిల్లలను దత్తత తీసుకొని వారికి పెళ్లిళ్లు చేయడాన్ని చూపించాను. నిజ జీవితంలోనూ సెక్స్‌వర్కర్ల పిల్లలు 1500 మందికి పెళ్లిళ్లు చేశాను. సమాజానికి మంచి చెయ్యాలనే సంకల్పంతో సినీ రంగానికి వచ్చాను. ఇది నాకు పూర్తిగా కొత్త పని అయినా, అన్నింటినీ దగ్గరుండి చూసుకున్నాను. యాక్షన్‌ డైరెక్టర్లు హెచ్చరించినా వినకుండా, యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ను ఉపయోగించకుండా నేనే నటించాను. ఆరు పాటలనూ నేనే పాడాను. మా కుటుంబ సభ్యులు కూడా దీనికి పనిచేశారు. మొదటి సినిమా చేసినప్పుడు బాలీవుడ్‌ నుంచి మొదట అంతగా స్పందన రాలేదు. ఇతనెందుకు సినిమాల్లోకి వచ్చాడన్నట్లు చూశారు, మాట్లాడుకున్నారు. కానీ రెండో సినిమా చేశాక, పాజిటివ్‌ రెస్పాన్స్‌ మొదలైంది. ఈ సినిమా తర్వాత ఓ టీవీ సీరియల్‌ చేద్దామనుకుంటున్నా. వచ్చే ఏడాది కానీ, ఆపై ఏడాది కానీ మరో మంచి విషయంతో ఇంకో సినిమా చేస్తా’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు, స్ర్కీన్‌ప్లే, సంగీతం: గుర్మీత్‌ రామ్‌రహీమ్‌సింగ్‌, ఛాయాగ్రహణం: అరవింద్‌కుమార్‌, కూర్పు: సంజయ్‌శర్మ, దర్శకత్వం: గుర్మిత్‌ రామ్‌రహీమ్‌సింగ్‌, జీతూ అరోరా ఇన్సాన్‌.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov