http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 29 September 2015

On 05:22 by Unknown   No comments
కమల్‌హాసన్‌ హీరోగా రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, శ్రీగోకులం మూవీస్‌ పతాకాలపై రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'చీకటి రాజ్యం'. ఈ చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. కాగా, సెప్టెంబర్‌ 28న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌, మేకింగ్‌ వీడియోను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో కమల్‌హాసన్‌, దర్శకుడు రాజేష్‌ ఎం.సెల్వ, నటి మధుశాలిని, మాటల రచయిత అబ్బూరి రవి, గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 
kamal hassan
 
యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ - ''నేను తెలుగులో స్ట్రెయిట్‌ ఫిలిం చేస్తానని చెప్పాను. ఈ సినిమా చేశాను. నన్ను స్టార్‌ని చేసిన తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా చేశాను. నేను నేషనల్‌ స్టార్‌ అవ్వడం ఇక్కడే మొదలైంది నాకు. తెలుగులో చేసిన మరో చరిత్ర హిందీలో ఏక్‌దూజే కేలియే అయింది. నా సినిమాలకు సంబంధించిన రికార్డ్‌ ఎక్కువ తెలుగులోనే వుంది. తమిళ్‌లో కూడా అంత లేదు. పర్సెంటేజ్‌ పరంగా చూస్తే నన్ను ఎక్కువ రిసీవ్‌ చేసుకుంది తెలుగు ప్రేక్షకులే. ఆ భయంతోనే నేను తెలుగులో ఆర్డినరీ ఫిలింస్‌ చెయ్యడానికి ఇష్టపడలేదు. 'చీకటి రాజ్యం' కూడా ఆర్డినరీ ఫిలిం కాదు. మీరు దీన్ని ఎక్స్‌ట్రార్డినరీ ఫిలిమ్‌గా చెయ్యాలి. ఈ సినిమాకి సంబంధించి సంవత్సరం నుంచి వర్క్‌ జరుగుతోంది.
 
ఈ సినిమాకి ఎవరు డైరెక్టర్‌ అనే విషయం రాజేష్‌గారికి కూడా చెప్పలేదు. నేనే ఈ సినిమాని డైరెక్ట్‌ చేస్తాను అనుకొని ఆయన వర్క్‌ చేస్తూనే వున్నారు. ఆ తర్వాత ఈ సినిమాని మీరే డైరెక్ట్‌ చేస్తున్నారని అతనితో చెప్పాను. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌లో రాజేష్‌ గారు ఏడున్నర సంవత్సరాలుగా వర్క్‌ చేస్తున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా స్టార్ట్‌ అయి స్టెప్‌ బై స్టెప్‌ ఎదుగుతూ ఏడున్నర సంవత్సరాల్లో డైరెక్టర్‌ అయ్యారు. డైరెక్టర్‌ అవ్వడానికి నాకు 27 సంవత్సరాలు పట్టింది. నేను ఒక సినిమాని డైరెక్ట్‌ చెయ్యగలను అని నన్ను నేను కన్విన్స్‌ చేసుకోవడానికి 27 సంవత్సరాలు పట్టింది. నేను ఎంతోమంది పెద్ద డైరెక్టర్స్‌తో వర్క్‌ చేశాను. బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారి లాంటి డైరెక్టర్స్‌తో వర్క్‌ చేసేటపుడు నేను యాక్టర్‌ని మాత్రమే కాదు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని కూడా. ఈ సినిమాకి సంబంధించి నేను ప్రొడ్యూసర్‌ని. 
 
ఒక మంచి సినిమా చేశామన్న ఆనందం మా అందరిలోనూ మీకు కనిపిస్తుంది. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ సినిమాలో రెండు షాట్స్‌లో మాత్రమే కెమెరా స్టాండ్‌ వాడాము. మిగతా షాట్స్‌ అన్నీ మొబైల్‌, స్టడీకామ్‌లోనే వుంటాయి. జిబ్రాన్‌ మ్యూజిక్‌ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో పాటలు లేవుగానీ మంచి మ్యూజిక్‌, ట్రెమండస్‌ యాక్షన్‌ వుంటుంది. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదు. ఈ మాటలు గర్వంతో చెప్పడం లేదు. సంతోషంతో చెప్తున్నాను.
 
ఇలా అన్ని సినిమాలకూ జరగదు. నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరూ ఎంతో ఎఫర్ట్‌ పెట్టి ఈ సినిమా చేశారు. ఫ్యామిలీలా కలిసి వర్క్‌ చేశామని అందరూ చెప్తుంటారు. కానీ, ఇది ఫ్యామిలీలా కాదు, ఫ్యామిలీయే. ఎలాంటి ఈగోస్‌ లేకుండా అందరూ వర్క్‌ చేశారు. నాకే కాదు ఈ సినిమాకి వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ఇది ఒక మెమరబుల్‌ మూవీ అవుతుంది. నేను చెప్పింది చేశాను కాబట్టి మీరు ఈ సినిమాని సక్సెస్‌ చేస్తారు, సక్సెస్‌ని మనందరం కలిసి చేసుకుంటామన్న నమ్మకం నాకు వుంది. ఈ సినిమాని నవంబర్‌లో రిలీజ్‌ చేద్దామని అనుకుంటున్నాము. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ బేనర్‌లో మరో పది సంవత్సరాల తర్వాత మళ్ళీ స్ట్రెయిట్‌ సినిమా చేస్తానని చెప్తాను అనుకోవద్దు. వెంటనే తెలుగు, తమిళ్‌లో మరో సినిమా చెయ్యబోతున్నాం'' అన్నారు. 
 
గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ - ''తెలుగులో సినిమా చేస్తానని చెప్పి మరీ ఈ సినిమా చేశారు కమల్‌ హాసన్‌గారు. ఆరోజుల్లో ఆకలి రాజ్యం ఎంత పెద్ద హిట్‌ అయిందో మీకు తెలుసు. కమల్‌గారే ఎంతో మక్కువతో 'చీకటి రాజ్యం' అనే టైటిల్‌ పెట్టారు. అంత పెద్ద హిట్‌ అవ్వాలి ఈ సినిమా. ఆ ఛాయలు అప్పుడే కనిపిస్తున్నాయి. ట్రైలర్‌ చాలా ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా వుంది'' అన్నారు. 
 
నటి మధుశాలిని మాట్లాడుతూ - ''త్రిషగారు, ప్రకాష్‌రాజ్‌గారు.. ఇలా ఈ సినిమాకి వర్క్‌ చేసిన చాలామంది నాకు తెలుసు. కానీ, వారితో కలిసి నటించే అవకాశం రాలేదు. అది ఈ సినిమాతో కుదిరింది. నేను ఈ సినిమా విషయంలో చాలా ఎక్సైటెడ్‌గా వున్నాను. కమల్‌హాసన్‌గారి సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేసినా ఫర్వాలేదు అనుకుంటాం. అలాంటిది ఇందులో చాలా మంచి రోల్‌ చేసే ఛాన్స్‌ ఇచ్చిన కమల్‌గారికి, డైరెక్టర్‌ రాజేష్‌గారికి థాంక్స్‌ చెప్తున్నాను'' అన్నారు. 
 
దర్శకుడు రాజేష్‌ ఎం.సెల్వ మాట్లాడుతూ - ''రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా స్టార్ట్‌ అయిన నేను ఈ సినిమాతో డైరెక్టర్‌ అయ్యాను. అయినప్పటికీ నేను విశ్వరూపం చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని అని చెప్పుకోవడమే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది. కమల్‌ సర్‌ని డైరెక్ట్‌ చెయ్యడం అనేది నా అదృష్టం. లాస్ట్‌ టైమ్‌ హైదరాబాద్‌ వచ్చినపుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చాను. ఈసారి నేను స్టేజ్‌ ఎక్కి మాట్లాడేలా చేశారు కమల్‌ సర్‌. హండ్రెడ్‌ పర్సెంట్‌ బెస్ట్‌ మూవీ ఇవ్వడానికి ట్రై చేశాను. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచీ ఎండ్‌ అయ్యే వరకు చాలా ఎంగేజింగ్‌గా వుంటుంది. తప్పకుండా మీ అందరూ ఎంజాయ్‌ చేసేలా సినిమా వుంటుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అన్నారు.
 
రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ - ''ఈ సినిమాలో ఒక ఫాదర్‌ కనిపిస్తాడు, ఒక హజ్బెండ్‌ కనిపిస్తాడు, ఒక ఇంటెలిజెన్స్‌ కనిపిస్తుంది. ఏదైనా మంచి ఇంగ్లీష్‌ సినిమా చూసినపుడు మన సినిమాల్లో కూడా సాంగ్స్‌ లేకుండా, ఒక ఫ్లోలో, ఒక జోనర్‌లో, ఏ కథ అయితే ఎత్తుకున్నామో దానిమీదే నడిచే సినిమా తెలుగులో చూస్తామా, అలాంటి సినిమా వస్తే బాగుంటుంది అని చాలా సార్లు అనుకుంటాం. అలాంటి సినిమాయే ఇది. మామూలుగా స్టార్ట్‌ అయిన సినిమా పది నిముషాల తర్వాత మన హార్ట్‌బీట్‌ని పెంచుతుంది. క్లైమాక్స్‌ వరకు అదే హార్ట్‌ బీట్‌ని కొనసాగిస్తుంది. నిముష నిముషం థ్రిల్‌ వుంటుంది, నిముష నిముషం టెన్షన్‌ వుంటుంది. యాక్షన్‌ అండ్‌ ఎమోషన్స్‌ వుంటాయి. అందరూ చూడాల్సిన సినిమా, అందరూ చూడదగ్గ సినిమా'' అన్నారు.
 
యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌, ప్రకాష్‌రాజ్‌, త్రిష, కిషోర్‌, సంపత్‌, యుహి సేతు, మధుశాలిని, ఆశాశరత్‌, సోమసుందరం, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్త్రి, ఉమా రియాజ్‌ఖాన్‌, ఛామ్స్‌, జగన్‌, అమ్మన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సను జాన్‌ వర్గీస్‌,  మాటలు: అబ్బూరి రవి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, డాన్స్‌: శోభి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: గౌతమి, ఆర్ట్‌: ప్రేమ్‌ నివాస్‌, ఎడిటింగ్‌: షాన్‌ మహమ్మద్‌, ఫైట్స్‌: గిల్స్‌ కాన్సీల్‌, టి.రమేష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: సితార సురేష్‌ బాలాజి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సురేష్‌ బాలాజీ, జార్జ్‌ పియుస్‌, కో-ప్రొడ్యూసర్‌: గోకులమ్‌ గోపాలన్‌, నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, దర్శకత్వం: రాజేష్‌ ఎం.సెల్వ.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov