http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 4 September 2015

On 00:50 by Unknown   No comments
లక్ష్మీమంచు స్వచ్ఛభారత్‌కు చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటికే ప్రధాని చేపట్టిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌‌కు అద్భుత స్పందన వచ్చింది. దేశంలోని పలు ప్రముఖులు ఎంతో బాధ్యతగా తీసుకుని దేశాన్ని పరిశుభ్రం చేయాలని శ్రమించారు. ఈ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా సినీ నటి, నిర్మాత లక్ష్మి మంచు ఎంపికయింది. సెప్టెంబర్‌ 10న రాష్ట్రపతి భవన్‌‌లో పలువురు ప్రముఖుల మధ్యలో రాష్ట్రపతి ఆమెను గౌరవించనున్నారు.
 
ఈ సందర్భంగా లక్ష్మిమంచు మాట్లాడుతూ.. ''ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అందుకొని, నా స్థాయిలో నేను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా ఎంపిక చేయడం మరింత బాధ్యత పెంచింది.

ఈ నెల 10న ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవాన్ని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇంతటి గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు'' చెప్పారు

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov