http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 13:55 by Unknown   No comments

  • తప్పుడు లెక్కలు చెప్పారని వ్యాఖ్య
  • షా అలా మాట్లాడలేదన్నారని ప్రధాని వివరణ
న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ‘‘అమిత్‌ షా ఇటీవల తెలంగాణకు వచ్చినప్పుడు ఏవేవో మాట్లాడారు. తెలంగాణకు అన్ని కోట్లు ఇచ్చినా.. ఇన్ని కోట్లు ఇచ్చినా అంటూ తప్పుడు లెక్కలు చెప్పారు. కేంద్రానికి తెలంగాణ సుమారు రూ.52 వేల కోట్లను పన్నుల రూపంలో ఇస్తుంటే.. కేంద్రం తిరిగి సుమారు రూ.25 వేల కోట్లే ఇస్తోంది. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడం లేదు’’ అని బుధవారం ప్రధానిని కలిసినప్పుడు స్పష్టం చేసినట్లు తెలిసింది.
 
అయితే, తెలంగాణ పర్యటన తర్వాత అమిత్‌షా తన వద్దకు వచ్చారని, తాను అలా మాట్లాడలేదని చెప్పారని మోదీ బదులిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రజలకు నిజాలు చెబితే బావుంటుందని, ఇవ్వని నిధులను ఇచ్చినట్లు చెబితే ఎలాగని కేసీఆర్‌ అడగ్గా.. ‘‘మీ దగ్గర అన్ని లెక్కలూ ఉన్నాయిగా’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక, తెలంగాణ వృద్ధి రేటుపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతోనూ కేసీఆర్‌ గట్టిగా వాదించినట్లు తెలిసింది. విభజన అనంతరం తెలంగాణ అభివృద్ధి రేటు 10 శాతంగా ఉందని జైట్లీ అన్నప్పుడు.. ‘‘మీకు ఎవరో తప్పుడు లెక్కలు చెబుతున్నారు.
 
తెలంగాణ వృద్ధి రేటు 21.5 శాతం. అసలైన లెక్కలు తెప్పించుకోండి’’ అని కేసీఆర్‌ గట్టిగానే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దక్షిణాది రాష్ర్టాల్లో బలపడాలని బీజేపీ కలలు కంటోందని, ఆ ప్రయత్నాలు ఫలించవని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉండదని, ఏపీలో మూడు జిల్లాల్లోనే ముస్లింలు ఉన్నందున అక్కడ ఎదిగే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారని విశ్లేషించారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov