http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 13:54 by Unknown   No comments
  • రైల్వేట్రాక్‌ పక్కన చెత్తకుప్పలో రూ.16 లక్షలు
  • గుర్తించిన చెత్తఏరే మహిళ.. పోలీసులు స్వాధీనం
  • పంజాగుట్టలో పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
  • రూ.1.20 కోట్ల విలువైన పెద్ద నోట్లు స్వాధీనం
  • రద్దైన పాతనోట్లపై కేంద్రం గోప్యత: తృణమూల్‌
 
మల్కాజ్‌గిరి/హైదరాబాద్‌ సిటీ/న్యూఢిల్లీ: రద్దు చేసి 8 నెలలైన తర్వాత కూడా పాత నోట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. కొందరు చెత్త కుప్పలో వేస్తే, మరికొందరు నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. గురువారం మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వాజ్‌పేయ్‌ నగర్‌ రైల్వే ట్రాక్‌ సమీపంలో గల చెత్తకుప్పలో రూ.1000, రూ.500 విలువ గల పాత కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. చిత్తు కాగితాలు ఏరుకునే చందగంగుబాయి(58) కాగితాలు ఏరుకుంటుండగా నోట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని విలువ రూ.16 లక్షలుగా లెక్కించారు.
 
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్‌ చందర్‌ తెలిపారు. మరోవైపు పంజాగుట్టలో కరాటే కోచ్‌ మహ్మద్‌ సలీం (38), అతడి స్నేహితులు సుబ్బారెడ్డి(47), మహ్మద్‌ అలీం(55) కమీషన్‌ ఆశతో గురువారం రూ.1.2 కోట్ల విలువైన రద్దైన నోట్లను మారుస్తూ టాస్క్‌ఫోర్స్‌ చేతికి చిక్కారు. కాగా, నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన పాత నోట్ల వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని కేంద్రాన్ని లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సౌగతరే నిలదీశారు. నోట్లు రద్దు చేసి 8 నెలలు గడిచినా, బ్యాంకులో జమ అయిన నోట్లను లెక్కిస్తున్నామని ఆర్బీఐ ఇప్పటికీ చెబుతోందంటూ కేవీ థామ్‌స(కాంగ్రెస్‌) ఆక్షేపించారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov