http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 18 July 2017

On 11:40 by Unknown   No comments
న్యూఢిల్లీ : తాను స్టేడియం అధికారినని...క్రీడల్లో అవకాశాలు కల్పిస్తానంటూ పదహారేళ్ల కబడ్డీ క్రీడాకారిణిపై ఓ ఆగంతకుడు అత్యాచారం జరిపిన దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగుచూసింది. కబడ్డీ క్రీడాకారిణి అయిన పదహారేళ్ల అమ్మాయి ప్రాక్టీసు చేసేందుకు ఢిల్లీలోని చహత్రాసాల్ స్టేడియానికి వచ్చింది. తాను స్టేడియం నిర్వహణాధికారినని... కబడ్డీలో మంచి అవకాశాలు కల్పిస్తానని ఆశ పెట్టి అమ్మాయిపై ఓ ఆగంతకుడైన 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ నెల 9వతేదీన జరిగిన ఈ ఘటన అనంతరం బాధిత అమ్మాయి అనారోగ్యానికి గురవడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. బాధిత బాలిక నిందితుడి వివరాలు చెప్పలేదు. దీంతో పోలీసులు నిందితుడు ఎవరనే విషయంపై స్టేడియంలో దర్యాప్తు చేస్తున్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov