http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 18 July 2017

On 11:39 by Unknown   No comments
ఆంధ్రజ్యోతి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వానికి, నటుడు కమల్‌హాసన్‌కి నడుమ జరుగుతున్న మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అన్నాడీఎంకే మంత్రులు మూకుమ్మడిగా కమల్‌ హాసన్‌పై ముప్పేట దాడికి దిగుతున్న నేపథ్యంతో విపక్షాలు కమల్‌కు మద్ధతు పలుకుతున్నాయి. డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్‌ ఇప్పటికే మద్ధతు తెలుపగా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ పార్టీ నేత ఓ.పన్నీర్‌సెల్వం, ఎండీఎంకే నేత వైగో, నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ సోమవారం కమల్‌కు మద్ధతుగా ప్రకటనలు చేసి, మంత్రుల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని, అదే తరహాలో కమల్‌హాసన్‌ ప్రభుత్వ తీరుపై అభిప్రాయలు వ్యక్తీకరించడం తప్పేమి కాదని ఆ నేతలు పేర్కొన్నారు.
 
         అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ మాత్రమే కమల్‌కు వ్యతిరేకంగా స్పందించారు. ఆమె సోమవారం విలఖరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు తెలియజేయవచ్చని, అయితే జయలలిత సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్ర సమస్యలపైగానీ, ప్రజా సమస్యలపైగానీ ఒక్కమాట మాట్లాడని కమల్‌హాసన్‌ ఇప్పుడెందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. డీఎంకే హయాంలో 2జీ కుంభకోణం అవినీతి కాదా? చిన్న సినిమాలకు థియేటర్లల దొరకకుండా చేయడం తప్పు కాదా? ఆ సమయంలో కమల్‌హాసన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. ఇక కమల్‌కు మద్ధతు తెలిపిన స్టాలిన్‌ గురించి ప్రస్తావిస్తూ... ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు స్టాలిన్‌ లేదని, కుటుంబ పాలన సాగిస్తున్న డీఎంకే ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన దాఖలాలు లేవని విమర్శించారు. చివరిగా, ఈనెల 27వ తేదీన రామేశ్వరం పేకరంబులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం స్మారక మందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తమిళిసై చెప్పారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov