http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 26 July 2017

On 20:04 by Unknown   No comments
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖలును డ్రగ్స్ వ్యవహారంపై సిట్ విచారిస్తోంది. బుధవారం హీరోయిన్ చార్మిని సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సిట్ విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా డ్రగ్స్ వ్యవహారంలో భాగస్వాములైన నటీనటులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. డ్రగ్స్ వ్యవహారంపై ఆయన తొలిసారిగా స్పందించారు. పలు సాక్ష్యాధారాలతోనే సినీ ప్రముఖులను విచారిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
 
         అందరి విచారణ పూర్తయ్యాక ఇండస్ట్రీలోని పెద్దలతో సమావేశమై తీసుకోబోయే చర్యల గురించి చర్చిస్తామని వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారంపై సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయిందనడం అవాస్తవమని, మొత్తం పరిశ్రమకు ఈ వ్యవహారాన్ని ఆపాదించడం సరికాదని ఆయన సూచించారు. డ్రగ్స్ వాడడం అనేది వారి..వారి వ్యక్తిగతమని, దానిపై సంబంధిత శాఖ అధికారులే చర్యలు తీసుకుంటారని వివరించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే పెద్దల నుంచి పిల్లల దాకా డ్రగ్స్‌కు బానిసలయ్యారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారని తలసాని చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov