http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 18 July 2017

On 11:48 by Unknown   No comments
తన తనయులపై వరసగా ముసురుకుంటున్న వివాదాలపై స్పందించారు రాజ్యలక్ష్మి. ఇటీవలే చిన్న కుమారుడు భరత్ యాక్సిడెంట్లో మరణించగా, తాజాగా మరో తనయుడు రవితేజ పేరు డ్రగ్స్ వ్యవహారంలో వినిపిస్తోంది. డ్రగ్స్ డీలర్ కెల్విన్ అరెస్టు నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు రవితేజకు నోటీసులు జారీ చేశారు. రవితేజ కూడా డ్రగ్స్ వినియోగదారుడు అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భరత్, రవితేజల తల్లి రాజ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తన తనయులు మంచోళ్లు అని ఆమె స్పష్టం చేశారు.

ముందుగా.. భరత్ మరణంపై మాట్లాడుతూ, భరత్ కు ఒకప్పుడు చెడు అలవాట్లు ఉన్న సంగతి నిజమే అని రాజ్యలక్ష్మి చెప్పారు. అయితే చివర్లో అతడు మారిపోయాడని ఆమె అన్నారు. మరణించడానికి కొన్నాళ్ల ముందు భరత్ అన్ని అలవాట్లనూ మానుకున్నాడని అన్నారు. తాగి వాహనం నడపడటం వల్లనే యాక్సిడెంట్ అయ్యిందని, దీంతోనే భరత్ మరణించాడనే మాటను ఆమె ఖండించారు. ప్రమాదసమయంలో భరత్ తాగలేదని ఆమె వ్యాఖ్యానించారు

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov