http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 13:50 by Unknown   No comments
ఇస్లామాబాద్‌: పనామా గేట్‌ కేసులో పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నేడు తీర్పు వెలువరిచిన పాక్‌ సుప్రీంకోర్టు.. ఆయనను ప్రధానిగా అనర్హుడిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాక్‌లో ఆకస్మిక ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడింది.  Panama case verdict: Pakistan SC disqualifies PM Nawaz Sharif
పనామా గేట్‌ కుంభకోణం కేసులో పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌, ఆయన కుటుంబసభ్యులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. 1990ల్లో షరీఫ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు గానూ అక్రమ నగదు చెలామణీకి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శుక్రవారం తుది తీర్పు వెలువరిచింది. ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అంతేగాక, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజా సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు పాకిస్థాన్‌లో సంచలనంగా మారింది. కోర్టు తీర్పు నేపథ్యంలో తన సోదరుడిని ప్రధాని చేయాలన్ని షరీఫ్ పాచికలు కూడా పారే అవకాశం లేకుండా పోయింది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov