http://www.propellerads.com/?rfd=TwUb

info

Sunday, 6 August 2017

On 18:33 by Unknown   No comments
ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్‌ ఛేంజ్‌ కాన్సెప్ట్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతన్నాయి. ఈ రక్షాబంధన్‌ పండుగ నాడు రాఖీ కట్టడమే కాకుండా సోదరుల రక్షణ కోసం హెల్మెట్ కూడా  ఇవ్వాలన్న కవిత పిలుపును అన్ని వర్గాల వారు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే కర్నాటక సీఎం సిద్ధరామయ్య, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్ సైతం ఎంపీ కవితను అభినందించారు. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా కవితపై ప్ర‌శంస‌లు కురిపించాడు. సిస్టర్స్ ఫర్ ఛేంజ్  కార్య‌క్ర‌మం ఒక మంచి ప్ర‌య‌త్న‌మ‌ని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్  చేయ‌డం, ఓవ‌ర్‌ స్పీడ్‌తో దూసుకెళ్ల‌డమంటే శ్మ‌శాన వాటికకు పాస్ పోర్టు తీసుకోవడమేనని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఎంపీ కవిత పిలుపు మేరకు సిస్టర్స్ అంతా తమ బ్రదర్స్ కు హెల్మెట్‌ ను గిఫ్ట్‌ గా ఇవ్వాల‌ని సెహ్వాగ్ కోరాడు.gift-a-helmet-rally
ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్ ఛేంజ్ కాన్సెప్ట్ కు అద్భుత స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కోసం ఊరూరా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇనిస్ట్యూషన్స్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సిస్టర్స్ ఫర్ ఛేంజ్- గిఫ్ట్ ఎ హెల్మెట్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. రాఖీ కట్టండి.. హెల్మెట్ ఇవ్వండి అనే నినాదంతో విద్యార్థినిలు భారీ ర్యాలీ నిర్వహించారు. హోంమంత్రి నాయినికి రాఖీ కట్టి హెల్మెట్ గిఫ్టుగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ జాగృతి నాయకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సిస్టర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంపై జాగృతి నేతలు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శేరిలింగంపల్లి జాగృతి శాఖ ఆధ్వర్యంలో బొల్లారం చౌరస్తాలో స్కూల్ విద్యార్థులతో  హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గాంధీకి స్థానిక మహిళా కార్పొరేటర్లు రాఖీ కట్టి హెల్మెట్ బహుకరించారు. అనంతరం విద్యార్థుల ర్యాలీ నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.
మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో కాలేజీ విద్యార్థులు సిస్టర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి.. గిఫ్ట్ హెల్మెట్ అని నినాదాలు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్‌కు రాఖీ కట్టి హెల్మెట్ బహుమతిగా అందజేశారు. ఎంపీ కవిత పిలుపు మేరకు రాఖీ పండుగ రోజు సోదరులకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. అటు కీసర మండల కేంద్రంలో సిస్టర్స్ ఫర్ ఛేంజ్ – గిఫ్ట్ ఎ హెల్మెట్ కార్యక్రమంలో భాగంగా జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలు రాఖీలు కట్టి హెల్మెట్లు గిఫ్టుగా ఇచ్చారు.
నిజామాబాద్‌లో జాగృతి ఆధ్వర్యంలో సిస్టర్స్ ఫర్ ఛేంజ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలువురికి రాఖీలు కట్టి హెల్మెట్లు బహుమతిగా అందజేశారు. రాఖీ పండగ నాడు రాఖీలు కట్టడమే కాకుండా సోదరుల రక్షణ కోసం హెల్మెట్లు బహూకరించాలని జాగృతి నేతలు పిలుపునిచ్చారు. అటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జాగృతి నేతలు సిస్టర్స్ ఫర్ ఛేంజ్ పై ర్యాలీ నిర్వహించారు. పలు కళాశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. జాగృతి మహిళా నేతలు పలువురికి రాఖీలు కట్టి హెల్మెట్లు గిఫ్టుగా ఇచ్చారు.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సిస్టర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాగృతి ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్షురాలు నళిని నారాయణ్.. సివిల్ సప్లయిస్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డికి రాఖీ కట్టి హెల్మెట్ బహుకరించారు. అనంతరం జాగృతి ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ తీశారు. సిస్టర్స్ ఫర్ ఛేంజ్‌ పై అవగాహన కల్పించారు. చెల్లికి అన్నయ్య రక్ష, అన్నయ్యకు హెల్మెట్ రక్ష నినాదంతో నల్లగొండలో జాగృతి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ కవిత పిలుపు మేరకు రాఖీ పండుగ నాడు సోదరులకు హెల్మెట్లు బహుకరించాలని జాగృతి నేతలు కోరారు.
సిస్టర్స్ ఫర్ ఛేంజ్ లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గ్రేటర్  వరంగల్ లో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. 300 మందితో కాశీబుగ్గ సెంటర్  నుంచి పోచమ్మ మైదాన్  వరకు ర్యాలీ సాగింది. వరంగల్  అర్బన్  జిల్లా జాగృతి అధ్యక్షులు ఎర్ర బాలు, టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎంపీ కవిత పిలుపు మేరకు రాఖీ పండుగ నాడు సోదరులకు హెల్మెట్లు గిఫ్టుగా ఇవ్వాలని కోరారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov