http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 13 April 2015

On 18:28 by Unknown   No comments
హైదరాబాద్: తను నటించిన ‘మార్గరిటా' చిత్రం చూసిన అనంతరం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కంటతడి పెట్టారని బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ తెలిపారు. ఆయన భార్య కిరణ్ రావు ఫోర్స్ చేయడంతో ఈ సినిమాకు వచ్చారు. అయితే సినిమా చూసిన అనంతరం ఎమెషన్ అయ్యారని తెలిపారు. తొలుత ఆయనకు ఆసక్తి లేక పోయినా....ఆయన భార్య కిరణ్ రావు బలవంతం మీద ఈ సినిమా చూడటానికి వచ్చారు. కానీ సినిమా చూసే సమయంలో ఆయన కంటతడి పెట్టకుండా ఉండలేక
అమిర్ ఖాన్‌తో కంటతడి పెట్టించిన మార్గరిటా
పోయారు. అమీర్ ఖాన్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చింది, సినిమా పూర్తయిన వెంటనే ప్రశంసలతో ముంచెత్తారని హీరోయిన్ కల్కి సంతషం వ్యక్తం చేసారు. అమిర్ ఖాన్‌తో కంటతడి పెట్టించిన మార్గరిటా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత భారత అభిమానుల ముందుకు ఈ చిత్రం త్వరలో రాబోతోంది. ఈ చిత్రంలో కల్కి ఒక 'మస్తిష్క పక్షవాతం'(సెరెబ్రల్ పల్సి) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో నటించారు. శోనాలి బోస్ ఈ చిత్రానికి కథ తయారు చేసుకుని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. కల్కి కోచ్లిన్, రేవతి, సయాని గుప్తా ముఖ్య పాత్రల్లో నటించారు. మిక్కీ మెక్ క్లేరీ సంగీతం అందించగా అన్నె మిసావా సినిమాటోగ్రఫీ అందించారు. ఏప్రిల్ 17వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov