http://www.propellerads.com/?rfd=TwUb

info

Monday, 13 April 2015

On 18:26 by Unknown   No comments
వెండితెరపై దూసుకువస్తున్న అక్కినేని హీరో అఖిల్. ఈ యంగ్ హీరో సినిమా విశేషాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అభిమానులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఆ విషయాలను ఫ్రెండ్స్ తో కలిసి పంచుకుంటూ వుంటారు. అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమా అఖిల్ సరసన కథానాయిగా నటిస్తున్నది ఎవరు.. చిత్ర షూటింగ్ లోకేషన్స్ స్పాట్ వంటి పలు విషయాలను గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు. ఇక వాళ్లు తాజాగా ఎదురు చూసేది ఈ సినిమా టైటిల్ ఏమిటనేదే.
 
ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం అఖిల్ కొత్త సినిమాకు 'మిస్సైల్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. ఇదే టైటిల్‌ని రిజిస్టర్ చేయించే అవకాశం ఉందని సమాచారం. ఈ టైలిల్ కథకి తగిన టైటిల్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయితే అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది వేచిచూడాలి. 
 
కాగా ఈ చిత్రంలో అఖిల్ సరసన సాయేషా సైగల్ కథానాయికగా నటించనుండగా, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విజయదశమికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov