http://www.propellerads.com/?rfd=TwUb

info

Sunday, 23 August 2015

On 00:45 by Unknown   No comments


భారీ తారాగణంతో గోపీచంద్‌ చిత్రం           గోపిచంద్‌తో 'యజ్ఞం' తర్వాత ఎ.యస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ గత కొన్ని రోజులుగా నిరవధికంగా జరుగుతుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం గురించి రవికుమార్‌ చౌదరి చెబుతూ'' గోపీచంద్‌తో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా కాంబినేషన్లో వచ్చిన 'యజ్ఞం'కి, దీనికీ సంబంధం లేదు. ఈ చిత్రకథ వినూత్నంగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. నా సినిమాల్లో ఎమోషన్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అది మిస్‌ కాదు. అలాగే, యాక్షన్‌ కూడా ఉంటుంది. ఇప్పటివరకూ గోపీచంద్‌ కెరీర్లో భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం ఇదే కావడం విశేషం. కథ డిమాండ్‌ మేరకు చాలా పాత్రలుంటాయి. అయితే, అన్ని పాత్రలకూ తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఒక సూపర్‌ హిట్‌ మూవీకి కావల్సిన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.
గోపీచంద్‌ సరసన రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షావుకారు జానకి, జయప్రకాశ్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పథ్వీ, అశుతోష్‌ రానా, ప్రదీప్‌ రావత్‌, నాజర్‌, ముఖేష్‌ రుషి, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే: కోన వెంకట్‌, రచన: ఘటికాచలం, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: శ్రీధర్‌ సీపాన, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: వివేక్‌ అన్నామలై.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov