http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 29 September 2015

On 05:16 by Unknown   No comments
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక యంగ్ హీరో నాగశౌర్య సరసన కథానాయికగా నటించబోతున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే.. నిహారికకి రెండో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ‘మిణుగురులు’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయోధ్యకుమార్ తాజా సినిమాలో నిహారిక కథానాయికగా ఎంపికైందని టాలీవుడ్ టాక్. ఇప్పటికే బుల్లితెరపై తన టాలెంట్ చూపిస్తున్న నిహారిక అప్పుడప్పుడు కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లోనూ నటించి తన సత్తా చాటుకుంటుంది. నిహారిక మొదటి చిత్రం మధుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. అక్టోబర్‌ నెలాఖరులో షూటింగ్‌ ప్రారంభించనున్న ఈ చిత్రానికి ఎ.అభినయ్‌, డా.కృష్ణ భట్ట సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిహారిక వెండితెర ఎంట్రీకి సిద్ధమైన వెంటనే ఆఫర్లు రావడంతో ఆమె ఫుల్ జోష్ మీదున్నట్లు కనబడుతుంది. మెగా ఫ్యామిలీ తొలి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న నిహారిక ప్రేక్షకులను ఏవిధంగా అలరిస్తుందో వేచి చూడాలి.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov