http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 22 July 2017

On 20:39 by Unknown   No comments
తన వందో చిత్రం ‘గౌతమిపుత్రి శాతకర్ణి’ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘పైసా వసూల్’ సినిమా చేస్తున్న బాలకృష్ణ.. ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాకు సైన్ చేసిన బాలయ్య.. ఆగస్టు 3 నుంచి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార నటిస్తోంది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారని, భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి స్వరాలు సమకూర్చిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నట్లు కల్యాణ్ తెలిపారు. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్‌ను నిర్మించామని, ఆగస్ట్ 3 నుంచి 30 రోజులపాటు అక్కడే చిత్రీకరణ జరగుతుందని నిర్మాత పేర్కొన్నారు.
 
ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రాంప్రసాద్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov