http://www.propellerads.com/?rfd=TwUb

info

Tuesday, 18 July 2017

On 11:38 by Unknown   No comments
విశాఖ: పశ్చిమ బెంగాల్‌, ఒడిసాను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మంగళవారం కల్లా వాయుగుండంగా బలపడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈ నెల 19న దక్షిణ ఒడిసాలో తీరం దాటే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ ఒడిసా, దానికి ఆనుకుని కోస్తాలో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అల్పపీడనం ప్రభావంతో ఒడిసా, ఏపీ, తెలంగాణల్లో సోమవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. మంగళ, బుధ వారాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, జూలై నెలలో ఇప్పటి వరకు ఒక మోస్తరుగానే వర్షాలు కురవడంతో అంతంతమాత్రంగా సాగుతున్న వ్యవసాయానికి తాజాగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మేలు చేకూరుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కోస్తాలోని మిగతా జిల్లాలు, రాయలసీమలోనూ మోస్తరు ప్రభావం చూపుతుందన్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov