http://www.propellerads.com/?rfd=TwUb

info

Saturday, 22 July 2017

On 21:04 by Unknown   No comments
గోవా చర్చిలో పెళ్లి.. జోరందుకున్న ఏర్పాట్లు
సమంత, నాగచైతన్య వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్టు తెలుస్తున్నది. పెళ్లి ఘడియలు సమీపిస్తుండటంతో వాటి ఏర్పాట్లు, హానీమూన్ ట్రిప్ ప్లాన్, షాపింగ్ తదితర అంశాలపై ఈ జోడి దృష్టిపెట్టినట్టు సమాచారం. సమంత, చైతూ పెళ్లికి, హానీమూన్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో అభిమానులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. వారి హానీమూన్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. వారు 40 రోజులపాటు హానీమూన్ ప్లాన్ ఏమిలేదని ఆ వార్తలను ఖండించారు సమంత.. 

గోవా చర్చిలో పెళ్లి.. జోరందుకున్న ఏర్పాట్లు

హిందూ, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం మూడు రోజులపాటు పెళ్లి జరుగుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. క్రిస్టియన్ ఆచారం ప్రకారం వీరిద్దరి పెళ్లి గోవాలోని ఓ హెరిటేజ్ చర్చిలో జరుగుతుందనే సమాచారం. వీరి పెళ్లి అక్టోబర్ 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఈ ఏడాది జనవరిలో చైతూ, నాగచైతన్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
40 రోజులు హానీమూన్ ట్రిప్

40 రోజులు హానీమూన్ ట్రిప్

అక్టోబర్‌లో జరిగే పెళ్లి తర్వాత దాదాపు 40 రోజులపాటు హానీమూన్ ట్రిప్‌కు ఏర్పాట్లు చేసుకొన్నారని, ఆ తర్వాత చైతూ, సమంతలు న్యూయార్క్ వెళ్లనున్నట్టు వార్తలు ప్రచారం జరిగాయి. ఏం మాయ చేశావే చిత్ర షూటింగ్ సందర్భంగా వీరద్దరూ న్యూయార్క్‌లో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అందుకే వారిద్దరూ పెళ్లి తర్వాత అక్కడి వెళ్లి తమ మధురస్మృతులను గుర్తు చేసుకోవాలని అనుకొంటున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఇవేమీ తమ ప్లాన్‌లో లేవని స్పష్టం చేసినట్టు సమాచారం.
 
పెళ్లైన మూడో రోజే షూటింగ్‌కు..

పెళ్లైన మూడో రోజే షూటింగ్‌కు.. సినిమా కమిట్‌మెంట్స్ ఉన్నందున పెళ్లి జరిగిన మూడో రోజుల తర్వాత షూటింగ్‌లో పాల్గొంటామని సమంత ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. పెళ్లి తర్వాత వెంటే హానీమూన్ ట్రిప్ ఉండదని, తాము సినిమాలను పూర్తి చేసి కొన్ని రోజులు గ్యాప్ తర్వాత హానీమూన్ వెళ్లనున్నట్టు ఆమె చెప్పారు. రంగస్థలంపై సావిత్రిగా .. ఇప్పటివరకు సమంత, చైతూ ఆటోనగర్ సూర్య, ఏం మాయ చేశావే, మనం చిత్రంలో కలిసి నటించారు. వారిద్దరూ జోడి చూడముచ్చటగా ఉంటుందనే అభిమానుల అభిప్రాయం. తెరపైన వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలో మళ్లీ వారు ఎప్పుడు కలిసి నటిస్తారనే అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజుగారి గది2, సావిత్రి, రంగస్థలం చిత్రాల్లో సమంత నటిస్తున్నారు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov