http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 19 July 2017

On 20:02 by Unknown   No comments

చెన్నై: నటి శ్రుతిహాసన్‌పై సీనియర్‌ నటి ఖుష్బూ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘమిత్ర చిత్రంపై పలువురు సత్యదూర వదంతులను సృష్టిస్తున్నారని ఆమె ట్విట్టర్‌లో ప్రస్తావించారు. దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రంగా సంఘమిత్ర ప్రారంభంలోనే గుర్తింపును సొంతం చేసుకుంది. ఇటీవల కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రారంభించారు కూడా. సుమారుర రూ.400 కోట్ల వ్యయంతో తేనాండాల్‌ ఫిలిమ్స్‌ దీనిని నిర్మిస్తున్నట్లు సమాచారం. జయంరవి, ఆర్య కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తొలుతగా శ్రుతిహాసన్‌ను ఎంచుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత శ్రుతిహాసన్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ సంఘమిత్ర గురించి మాట్లాడటానికి నిరాకరించారు. అది ముగిసిపోయిన కథగా భావిస్తున్నా అని ఒక్క మాటలో కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో నటి ఖుష్బూ తాజాగా ట్విట్టర్‌లో స్పందిస్తూ దేశంలోనే ఇదివరకు లేని విధంగా భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర్ణను తెరకెక్కిస్తున్నాం. సరైన పథకం లేకుండా ఈ సినిమాను రూపొందించడం సాధ్యం కాదు. అయితే ఈ చిత్రం స్క్రిప్ట్‌ ఇంకా సిద్ధం కాలేదు అని కొందరు అవాస్తవాలు చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన పనులు రెండేళ్ల క్రితం నుంచే మొదలయ్యాయి. వృత్తిపై అంకితభావం లేని వారికి వాటికి గురించి ఏ మాత్రం తెలియదు. ఈ సినిమాకు చిత్రీకరణ 30 శాతం మాత్రమే ఉంటుంది. అంతకు ముందుగానే మిగిలిన 70 శాతం పనులు పూర్తయ్యాయి. మీలో తప్పులు పెట్టుకుని ఇతరులపై నింద మోపకూడదు. ద్రాక్ష పుల్లగా మారిపోయిందా?.. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మీ నుంచి వృత్తి గౌరవాన్ని ఎదురుచూస్తున్నా. మీ తప్పులను మీరు అర్థం చేసుకుంటే.. అది మీ సుదూర ప్రయాణానికి సహకరిస్తుంది అంటూ ఘాటుగా ప్రస్తావించారు ఖుష్బూ.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov