http://www.propellerads.com/?rfd=TwUb

info

Friday, 28 July 2017

On 14:13 by Unknown   No comments
బీజింగ్: పూల మార్కెట్‌లోని ఓ దుకాణంలో ఎవరో ఓ పువ్వును ఎత్తుకెళ్లారు. ఆ విషయం గ్రహించిన దుకాణం సిబ్బంది కంగారుపడిపోయి పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా హుటాహుటిన వచ్చి సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి, ఆ పువ్వును తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించి, ఆ వ్యక్తి ఇంటికెళ్లి మరీ పువ్వును స్వాధీనం చేసుకున్నారు. వార్నీ.. వందల రకాలు.. వేలకొద్దీ పూలు ఉండే పూల మార్కెట్ లో ఒక్క పువ్వును ఎవరో తీసుకెళితే ఇంత హంగామానా? పూల దుకాణం వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటి? వాళ్లు ఉరుకులు పరుగులు పెట్టి మరీ దాన్ని రికవరీ చేయడం ఏమిటి అనుకుంటున్నారు కదూ? దాని విలువ తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మరి. Woman Mistakenly Takes Home a Rare Flower Worth $3 Million in China
అసలేం జరిగిందంటే... చైనాలోని ఓ తైవానీస్‌ పూల దుకాణానికి వచ్చిన ఓ మహిళ ఓ పువ్వును కొనుగోలు చేసింది. తీరా డబ్బు చెల్లించాక, అదంత బాగాలేదనుకుని అక్కడే పెట్టేసి, దుకాణం యజమానికి చెప్పకుండానే దాని పక్కనే ఉన్న ఐరీస్‌ జపొనికా(బటర్‌ఫ్లై ఫ్లవర్‌)గా పిలిచే మరో వువ్వును తీసుకుని ఇంటికెళ్లిపోయింది. ఆ మహిళ వెళ్లిపోయిన కాసేపటి తర్వాత దుకాణంలో ఐరీస్‌ జపొనికా పువ్వు కనిపించక పోవడంతో దుకాణం సిబ్బంది కంగారు పడిపోయారు. ఎందుకంటే అది చాలా అరుదైనది. ఎనిమిది సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి సేద్యం చేసి దాన్ని అభివృద్ధి చేశారు. ఆ పువ్వు విలువ దాదాపు రూ. 20 కోట్లు.
అసలేం జరిగిందంటే... చైనాలోని ఓ తైవానీస్‌ పూల దుకాణానికి వచ్చిన ఓ మహిళ ఓ పువ్వును కొనుగోలు చేసింది. తీరా డబ్బు చెల్లించాక, అదంత బాగాలేదనుకుని అక్కడే పెట్టేసి, దుకాణం యజమానికి చెప్పకుండానే దాని పక్కనే ఉన్న ఐరీస్‌ జపొనికా(బటర్‌ఫ్లై ఫ్లవర్‌)గా పిలిచే మరో వువ్వును తీసుకుని ఇంటికెళ్లిపోయింది. ఆ మహిళ వెళ్లిపోయిన కాసేపటి తర్వాత దుకాణంలో ఐరీస్‌ జపొనికా పువ్వు కనిపించక పోవడంతో దుకాణం సిబ్బంది కంగారు పడిపోయారు. ఎందుకంటే అది చాలా అరుదైనది. ఎనిమిది సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి సేద్యం చేసి దాన్ని అభివృద్ధి చేశారు. ఆ పువ్వు విలువ దాదాపు రూ. 20 కోట్లు. FB Viral Video: Chinese Man Drinks 3 Litres Of Cool Drink In Just Over 1 Minute | Oneindia Telugu ఆ పువ్వును ఉపయోగించి అలాంటి పూల మొక్కల్నే పెంచాలని.. తద్వారా తన పూల వ్యాపారం లాభాల బాట పట్టించాలని కూడా సదరు దుకాణం యజమాని కలలు కన్నాడు. అంతేకాదు.. ఆ పూల కోసం పలు సంస్థల నుంచి ఇప్పటికే ఆర్డర్లు కూడా వచ్చాయట. ఇంతలో ఉన్నట్లుండి ఉన్న ఒక్కగానొక్క పువ్వు కూడా మాయం అయిపోయింది. దీంతో సిబ్బందికి గుండెలు జారిపోయాయి. దుకాణం యజమాని ఎక్కడ తిడతాడో అనే భయంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు రంగంలోకి దిగడం వెంటవెంటనే జరిగిపోయాయి. పూల దుకాణంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు ఆ పువ్వును తీసుకెళ్లిన మహిళను గుర్తించారు. ఆమె కారు నెంబరు ఆధారంగా చిరునామా కనుక్కొని ఇంటికి వెళ్లారు. ఆ పువ్వు విలువ తెలుసుకున్న తరువాత ఆ మహిళ సారీ చెప్పి పువ్వును పోలీసులకు అప్పగించడంతో దుకాణం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఆ మహిళకు తెలియక ఆ పువ్వు తీసుకెళ్లిందనే కారణంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇదంతా చదివాక.. వార్నీ పూలల్లో కూడా ఇంత విలువైన పూలు ఉంటాయాని ఆశ్చర్యపోవడం మన వంతు!

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov